‘శంకరాభరణం’ మూవీ విడుదల అయి 40 సంవత్సరాలు పూర్తి అయిన ఆ సినిమాను ఇప్పటికి తెలుగు ప్రజలు మరిచిపోలేదు. దర్శకుడు విశ్వనాధ్ ను కళా తపస్వి గా మార్చిన ఆ మూవీ తెలుగు సినిమా చరిత్రలో ఒక శాశ్వత స్థానాన్ని ఏర్పరుచుకుంది. అప్పట్లో ఈ సినిమాను చూస్తూ తనకు కలిగిన భావోద్వేగానికి సంబంధించిన ఒక ఆసక్తికర సంఘటనను చిరంజీవి సమంత ఆహా కోసం హోస్ట్ చేస్తున్న ‘సామ్ జామ్’ కార్యక్రమంలో వివరించాడు.
చిరంజీవి కెరియర్ ప్రారంభంలో చిరంజీవి మంజుభార్గవితో కలిసి ఒక సినిమా చేయడంతో అప్పటి నుండి వారిద్దరి మధ్య సానిహిత్యం ఉన్న ఆ రోజులను చిరంజీవి గుర్తు చేసుకున్నాడు. అప్పటికి తనకు ఇంకా పెళ్ళి కాలేదని సురేఖను ఇచ్చి చేయాలని అల్లు రామలింగయ్య అనుకుంటున్న రోజులని చెపుతూ తన చేతిలో హీరోయిన్ మంజుభార్గవి చెంగు ఉన్న విషయాన్ని రామలింగయ్య చూసిన సందర్భాన్ని గుర్తు చేసుకుని తాను అప్పట్లో రామ లింగయ్య ఏమనుకుంటారో అని భయపడిన విషయాను జ్ఞాపకం చేసుకున్నాడు.
‘శంకరాభరణం’ సినిమా ప్రీమియర్ షోకు తానూ మంజు భార్గవి ఆహ్వానం పై వెళ్ళిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ ‘శంకరాభరణం’ మూవీ క్లైమాక్స్ కు వచ్చేసరికి తన కంట కన్నీళ్లు ఆగలేదు అని చెపుతూ షో పూర్తి అయి లైట్లు వేసే లోపు కన్నీళ్లు తుడుచుకుందామని తన కర్చీఫ్ ఎక్కడ ఉందా అని వెతుక్కుంటున్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఆ సమయంలో తన భాదను గ్రహించిన మంజుభార్గవి తన చీర చెంగు అందించింది అని చెపుతూ దాంతో కళ్లు తుడుచుకుంటుండగా లైట్లు ఆన్ అవడంతో ఆమె చీర చెంగు తన చేతిలో ఉన్న విషయం అల్లు రామ రామలింగయ్య చూసారని ఆ సంఘటన జరిగిన 2-3 నెలలకే సురేఖ పెళ్లి సంబంధం రావడం ఫైనల్ కావడం జరిగిందిఅని అంటూ మంజు భార్గవి చీర కొంగు తన చేతిలో ఉన్న విషయం గురించి తన మామ గారు అల్లు రామలింగయ్య ఏమి అనుకున్నారో తనకు ఇప్పటికీ తెలియదు అంటూ జోక్ చేసాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి