టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. స‌ర్కారు వారి పాట లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇక మ‌హేష్‌బాబుకు ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కెవి. గుహ‌న్‌కు ఉన్న రిలేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గుహ‌న్ మ‌హేష్ కు రెండు సినిమాల‌కు కెమేరామెన్‌గా వ‌ర్క్ చేశాడు. దూకుడు, అత‌డు లాంటి సినిమాలో కెమెరామెన్ గా ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత గుహాన్ మెగా ఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కుడిగా మారాడు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన 118 సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన గుహాన్ ఆ సినిమా కోసం కొత్త క‌థ‌ను ఎంచుకుని.. చాలా డిప‌రెంట్‌గా ప్ర‌జెంట్ చేశాడ‌న్న మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక వ‌రుస ప్లాపుల్లో ఉన్న క‌ళ్యాణ్ రామ్‌కు సైతం ఈ సినిమాతో మంచి హిట్ ద‌క్కింది. ఈ క్ర‌మంలోనే గుహ‌న్ ప్ర‌స్తుతం W W W సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్‌తోనే పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేయ‌డంతో పాటు గుహ‌న్ ఏదో కొత్త‌గా చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌న్న ఆలోచ‌న ప్ర‌తి ఒక్క‌రిలో క‌లిగేలా చేసింది.

ఈ టీజ‌ర్‌ను ఇటీవ‌లే మ‌హేష్‌బాబు రిలీజ్ చేశాడు. త‌న‌కు ఇష్టం అయిన గుహ‌న్ డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో ఈ సినిమాను ముందు నుంచి మ‌హేష్ ప్రోత్స‌హిస్తూనే ఉన్నాడు. 118 సినిమా చూసి మెస్మ‌రైజ్ అయిన మ‌హేష్ గుహ‌న్‌ను పిలిపించుకుని మాట్లాడాడ‌ట‌. ఆ వెంట‌నే మీ టీజ‌ర్‌ను నేనే రిలీజ్ చేస్తాన‌ని మాట ఇవ్వ‌డంతో పాటు టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఇక W W W సినిమా ప్ర‌మోష‌న్ల‌కు కూడా త‌న వంతుగా కృషి చేస్తోన్నాడు. మీకు ఏ అవ‌స‌రం అయినా నాకు చెప్పండి నేను మీ వెన‌క ఉంటా.. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు కావాలంటే నేను కూడా వ‌స్తాన‌ని మ‌హేష్ గుహ‌న్ కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట. 

మరింత సమాచారం తెలుసుకోండి: