ప్రస్తుతం బుల్లితెర షో లకు రోజురోజుకూ క్రేజ్  పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు బుల్లితెరపై ఎంతో ప్రతిష్టాత్మకంగా బిగ్ బాస్  తెలుగు రియాల్టీ షో ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. మనకు తెలిసిన సెలబ్రిటీల గురించి మనకు తెలియని విషయాలను తెలియజేస్తూ.. బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైమ్ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అటు బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతగానో క్రేజ్  సంపాదించుకొని టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పటి వరకు బిగ్ బాస్ నాలుగు సీజన్లు  జరగగా ఇక బిగ్ బాస్ షో క్రేజ్  అంతకంతకూ పెరిగి పోయింది అన్న విషయం తెలిసిందే.



 ఇక బిగ్ బాస్ షో చివరి వరకు కూడా ఎవరు విన్నర్  గా అవ్వబోతున్నారు అనే దానిపై ఎంతగానో ఆసక్తి నెలకొంటుంది. అటు ప్రేక్షకులు వేసిన ఓట్లు ఆధారంగానే బిగ్ బాస్ విన్నర్ ఎవరో డిసైడ్ చేస్తారు అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో అభిజిత్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న అభిజిత్ చివరికి టైటిల్ విన్నర్ గా నిలిచాడు. ఇదిలా ఉంటే ఇటీవలె ఓ ఇంటర్వ్యూ కి హాజరైన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ విన్నర్ శివ బాలాజీ బిగ్ బాస్ షో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 ఇటీవల ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బిగ్ బాస్ విన్నర్ గురించి ముందుగా మీరు ఏమనుకున్నారు మీరు ఊహించిన వాళ్లే టైటిల్ విన్నర్ గా నిలిచారా  అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు శివబాలాజీ. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అన్నది ముందుగానే తెలిసిపోతుందని ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరు ట్రెండ్ అవుతున్నారు అన్నది ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది కాబట్టి టైటిల్ విన్నర్ గా  ఎవరు నిలుస్తారు అన్న దానిపై కూడా క్లారిటీ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు శివ బాలాజీ.  అయితే సినిమాల్లో నటించిన అభిజిత్ విన్నర్ గా నిలిచినప్పటికీ  సోహైల్ తనను తాను మెరుగు పరుచుకుంటూ అందరికీ దగ్గరయ్యాడు అంటూ తెలిపాడు శివ బాలాజీ.

మరింత సమాచారం తెలుసుకోండి: