ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో చాలా మంది నటీనటులు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేయాలని విశ్వప్రయత్నాలు చేస్తారు. కానీ కొందరికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించినా మరికొంత మందికి మాత్రం ప్రేక్షకుల నుంచి పేరును తెచ్చుకోలేకపోతుంటారు. ఈ కారణంతో కొందరు రెండు మూడు సినిమాలకే సినీ ఇండస్ట్రీకి బైబై చెప్పేస్తుంటారు.. మరికొందరు తమ అదఈష్టాన్ని అలాగే అనేక సినిమాల ద్వారా పరీక్షించుకుంటారు. ఒక్క సినిమా హిట్ అయ్యిందంటే చాలు వారి పంట పండినట్టే.. అందుకోసమే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోలు హిట్ కోసం పడిగాపులు కాస్తుంటారు. అందులో విజయ్ దేవరకొండ తమ్ముడు కూడా ఒక్కడనే చెప్పుకోవచ్చు.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేశాడు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ హీరోకు ఆశించినంత గుర్తింపు రాలేదు. దాంతో ఈ హీరో తర్వాత సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఆనంద్ తన నటన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ మూవీ ఆనంద్ దేవరకొండకు మంచి విజయాన్ని సాదించిపెట్టింది. ఇంకేముంది ఈ హిట్ తో ఆనంద్ దేవరకొండకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా ఈ హీరోకు అవినాష్ కోకాటి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చిందట. దాంతో ఈ సినిమా పట్ల ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నాడు ఈ యంగ్ హీరో. ముఖ్యంగా ఈ కథలో తన పాత్ర ఆనంద్ దేవరకొండకు బాగా నచ్చేసిందట. మొత్తంగా ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకుని ఈ హీరో సినిమాల జోరును పెంచడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. చూడాలి మరి అన్నయ్య విజయ్ దేవరకొండలా ఆనంద్ దేవరకొండ కూడా స్టార్ అవుతాడో.. లేదో.. ఇక నుంచి ఈ హీరో వరుస సినిమాలతో బిజీగా మారబోతున్నాడని అర్థమవుతోంది. కాగా ఈ హీరో ప్రస్తుతం మరో సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: