మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు. అది నిజ జీవితంలో కూడా చాలా వరకు నిజమేనని అప్పుడప్పుడు నిరూపించబడుతుంది.  మనకు కూడా ఎదురైన కొన్ని సందర్భాలలో "నీ లాంటి వ్యక్తిని  ఇంకొకరిని చూశాం అని, అరే చూడ్డానికి అచ్చం నీలాగే ఉన్నాడు వాడు అంటూ" మన వాళ్ళు మనతో చాలా సార్లు అన్న సందర్భాలు మనకు గుర్తుకొస్తాయి. ఇలా ఎప్పుడో ఒకప్పుడు ఎన్నో సందర్భాలలో ఇలా మనిషిని పోలిన మనుషులని చూస్తూనే ఉంటాము. కానీ ఆ మనుషులను పక్కపక్కన చూస్తే, అది చెప్పడానికి వర్ణనాతీతం.  సాధారణంగా కవలల అయితే చూడ్డానికి ఒకేలా కనిపిస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులకు కొన్ని జన్యువుల కారణంగా కేవలం ఇద్దరు సేమ్ టు సేమ్ ఉంటారు. కానీ ఇక్కడ మన సినీ ఇండస్ట్రీలో కూడా ఎలాంటి బంధుత్వం లేకుండా వారు కూడా సేమ్ టు సేమ్ ఉన్నారు. మన సినీ ఇండస్ట్రీలో సేమ్ టు సేమ్ ఫేస్ ఉన్న వారు ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

కళ్యాణ్ దేవ్ -  బాబీ :
విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మేనల్లుడు కళ్యాణ్ దేవ్, దర్శకుడు బాబీ ఇద్దరూ  చూడడానికి ఒకేలా ఉంటారు. వీరిద్దరిని అన్నదమ్ముల అని చెప్పినా కూడా తొందరగా నమ్మేయొచ్చు.

త్రిష - రేష్మ:
మారుతి దర్శకత్వంలో వచ్చిన "ఈ రోజుల్లో "సినిమాలో హీరోయిన్ గా మెరిసిన రేష్మా చూడడానికి అచ్చు  త్రిష లా  అనిపిస్తూ ఉంటుంది.

ఐశ్వర్యరాయ్ - స్నేహ ఉల్లాల్:
స్నేహ ఉల్లాల్, ఐశ్వర్య రాయ్ తొలిరోజుల్లో ఎలా ఉండేదో అచ్చం అలాగే ఉంది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన స్నేహ ఉల్లాల్ అంతకుముందు బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ కి డూప్ గా  చేసేదట.

నిరోషా  - సిల్క్ స్మిత :
ఇక సినీ ఇండస్ట్రీలో  నిరోషా కు, సిల్క్ స్మిత  కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని అందరూ అంటుంటారు. నిజానికి నిరోషా నటి రాధిక సొంత అక్కాచెల్లెలు. కానీ వీరిద్దరికి  మాత్రం ఎలాంటి పోలికలు లేవు.

షాన్ -  విజయ్ ప్రకాష్:
షాన్ తోపాటు విజయ్ ప్రకాష్ కి కూడా ఇద్దరూ సింగర్ లే. వీరిద్దరూ చూడ్డానికి అచ్చం ఒకే లాగా కనిపించినప్పటికీ షాన్ నార్త్ ఇండియన్ బాలీవుడ్ సింగర్ అయితే విజయ్ ప్రకాష్ ది మైసూర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో అన్నింటికీ పాటలు పాడుతారు.

హన్సిక  - కుష్బూ :
ఇక వీరిద్దరూ  కూడా చూడ్డానికి అచ్చం ఒకే లాగే కనిపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: