రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ఆది పురుష్ ఇపుడు షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ సైతం రెస్ట్ లెస్ గా వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. రాధేశ్యాం మూవీకి గుమ్మడి కాయ కొట్టేసిన ప్రభాస్ ఆది పురుష్ సలార్ మూవీస్ ని దాదాపుగా ఒకేసారి  సెట్స్ మీదకు తెస్తున్నారు. ఇక ఆదిపురుష్ మూవీ షూటింగ్ ప్రభాస్ లేకుండా కొన్ని షెడ్యూల్స్ జరుగుతాయని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ మూవీలో ఎక్కువగా సీజీ వర్క్స్ ఉండడంతో దాన్ని ముందు తీస్తున్నారు అంటున్నారు. ఇక ఈ సినిమాలో రాముడుగా ప్రభాస్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అందరూ హర్షించారు.  రావణుడుగా సైఫ్ ఆలీఖాన్ ని కూడా తీసుకున్నారు. మిగిలిన పాత్రలకు కూడా కాస్టింగ్ పూర్తి అయింది అంటున్నారు. కానీ ఈ సినిమాలో అతి ముఖ్యమైన సీత పాత్రకు మాత్రం ఇంతవరకూ ఎవరినీ సెలెక్ట్ చేయకపోవడం పట్ల ఫ్యాన్స్ నుంచి ఒక్కటే లెక్కన‌ ప్రశ్నలు వస్తున్నాయట.

ఆది పురుష్ టీమ్  ని ఈ విషయమై తెగ వేధిస్తున్నారుట. ఆది పురుష్ లో సీత పాత్రధారి ఎవరు, ఎవరా హీరోయిన్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలకు డైరెక్టర్ ఓం రౌత్ జవాబు చెప్పలేక సతమతమవుతున్నారట. ఇదిలా ఉంటే ఆది పురుష్ చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం బట్టి వచ్చే నెలలో సీత పాత్రధారి ఎవరు అన్నది రివీల్ చేస్తారట.

అంతవరకూ ఆ సస్పెన్స్ కొనసాగుతుంది అంటున్నారు. ఇక సీత కోసం కొన్ని పేర్లు కూడా ఇప్పటికే ప్రచారంలోకి వచ్చాయి. సీతగా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ నుంచి అనేక మంది పేర్లను కూడా సీరియస్ గానే పరిశీలిస్తున్నారని అంటున్నారు. అయితే ఎవరూ ఇప్పటిదాకా ఫిక్స్ కాకపోవడం వల్లనే ఆ పేరు రివీల్ చేయడానికి ఆలస్యం అవుతోంది అంటున్నారు. మరి ఫిబ్రవరి నెలకైనా సీత పాత్రధారి ఎంపిక పూర్తి అవుతుందా అన్నదే చర్చగా ఉందిట.


మరింత సమాచారం తెలుసుకోండి: