టాలీవుడ్‌లో గ‌త సంక్రాంతికి సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు వ‌ర్సెస్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే న‌డిచింది. వీరు న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో సినిమాల‌తో బాక్సాఫీస్ పోరును ర‌స‌వ‌త్త‌రంగా మార్చారు. ఆ మాట‌కు వ‌స్తే ఈ ఇద్ద‌రు హీరోలు ఒకే రిలీజ్ డేట్ వేసుకోవ‌డంతో పాటు ప్రెస్టేజ్‌కు వెళ్ల‌డంతో పెద్ద త‌తంగ‌మే న‌డిచింది. చివ‌ర‌కు మ‌హేష్ సినిమా ఒక రోజు ముందు వ‌చ్చింది. రెండు సినిమాలు హిట్ అయినా అంతిమంగా బ‌న్నీ పై చేయి సాధించాడు. అయితే అప్ప‌టి నుంచి కూడా ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప‌రోక్ష యుద్ధ‌మే జ‌రుగుతోంది.

ఇక ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఇప్పుడు ప్ర‌క‌ట‌న‌ల యుద్ధం కూడా కొత్త‌గా మొద‌లైందంటున్నారు. టాప్ ప్ర‌క‌ట‌న‌ల్లో పోటాపోటీగా క‌నిపించేందుకు ఉవ్విళ్లూరుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప‌లు కంపెనీల ప్ర‌క‌ట‌న‌ల‌కు మహేష్‌బాబు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నారు. ఓ అంచనా ప్రకారం బ్రాండ్ అంబాసిడర్ గా సూపర్ స్టార్ ఆదాయం సంవత్సరానికి 75 కోట్ల పైమాటనేట. కేవ‌లం యేడాదిలో ఈ రేంజ్‌లో ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఆదాయం పొందుతోన్న మ‌రో తెలుగు హీరో లేరంటే మ‌హేష్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థ‌మ‌వుతోంది.

ఇక తెలుగులో నే కాకుండా సౌత్‌లోనే మ‌హేష్ టాప్ ప్లేస్‌ల ఉన్నాడు. ఇక ఇప్పుడు మ‌హేష్‌కు పోటీగా అల్లు అర్జున్ కూడా వ‌స్తున్నాడు. ప‌లు బ్రాండ్స్ ప్ర‌మోట్ చేసి భారీగా ఆదాయం సంపాదించ‌డంపై కాన్ సంట్రేష‌న్ చేశాడ‌ట‌. అల్లు అర్జున్ గ‌తంలోనూ కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్‌, లాట్ మొబైల్స్, 7అప్, జాయ్ అలూకాస్ కంపెనీల ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించాడు. ఇప్పుడు త‌మ ఓటీటీ బ్రాండ్ ఆహాను కూడా స్వ‌యంగా ప్ర‌మోట్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే మ‌రిన్ని టాప్ కంపెనీల బ్రాండ్స్ ను కూడా త‌న ఖాతాలో వేసుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం మ‌నోడు దూకుడు చూస్తుంటే మ‌హేష్ ను మ‌ళ్లీ టార్గెట్ చేస్తూ మ‌హేష్ ను మించిపోయే బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మార‌నున్నాడ‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: