అస్సలు ఏ రాజీ లేదు. యంగ్ హీరోయిన్స్‌లో యమా పాప్యులారిటీ ఉన్న ముద్దుగుమ్మలు మొత్తం పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫోన్లు వస్తాయేమోనని ఎదురుచూపులుతోనైనా కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్పితే సీనియర్ హీరోస్ జోలికి వెళ్ళడానికి మాత్రం మొగ్గు చూపడం లేదు. పక్కనున్న మేనేజర్లు కూడా ఈ యంగ్ హీరోయిన్స్‌కి నూరిపోస్తున్నారట వద్దువద్దని. అయితే ఇలాటి సందిగ్ధంలో ఈ హీరోయిన్స్ రెండింటికీ చెడ్డ రేవడిలా కూడా తయారవుతున్న సందర్భాలు కూడా కోకొల్లలు అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
కొందరు హీరోయిన్స్‌కైతే డైరెక్టర్స్ పిచ్చి. తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద హీరో పక్కన చేసిన ఓ హీరోయిన్ ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేశాడని గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లోనే చాలా కాలం ఉండిపోయింది. సదరు హీరోయిన్ మేనేజర్ ఎన్ని అవకాశాలు ఇంటి వరకూ తెచ్చినా కూడా ససేమిరా అంటే ససేమిరా అని భీష్మించుకుని కూర్చుంది..సో మొత్తానికి అదన్నమాట విషయం.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి