భారత చలన చిత్ర రంగం అది టాలీవుడ్ అయినా, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ -ఫైనల్గా బాలీవుడ్ – ఏదైనా - అన్ని సినీ ప‌రిశ్ర‌మ‌లూ "హీరో” ల చుట్టూనే ప్రదక్షిణం చేస్తుంటాయి అంటే “హీరో-సెంట్రిక్” అన్నమాట




సినిమాలలో హీరోల పాత్ర‌ల‌కే అధిక ప్రాధాన్యం, ప్ర‌మోష‌న్ల‌లో కూడా వారికే ప్రథమ తాంబూలం అంటే ప్ర‌యారిటీ ఇస్తారు. కొన్ని సినిమాల్లో మాత్ర‌మే హీరోయిన్లు అడపా దడపా ‘హైలైట్’ అవుతుంటారు. ప్ర‌మోష‌న్ల‌లోనూ వారికి ప్రాధాన్యం దొరుకుతుంది. అది వెరీ రేర్.




ఐతే విరాట‌ప‌ర్వం సినిమాలో హీరో దగ్గుబాటి రానా కు దీటుగా, చెప్పాలంటే హీరోకు మించి ‘హీరోయిన్ పాత్ర” సాయిప‌ల్ల‌వి కి ఉంటుందేమో? అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కారణం వారు వదిలిన పోస్ట‌ర్, ప్రోమోలు, టీజర్లు.




అసలు సినిమాలో ఎలా ఉంటుందనేది సినిమా విడుదలైన తరవాత కదా! తెలుస్తుంది. కానీ ప్ర‌మోష‌న్ల‌లో ఆమెకిస్తున్న ప్రాధాన్యం అందరినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోల్లో “రానా” ను మించి “సాయి ప‌ల్లవి” హైలైట్ అవుతోంది. ఆమె ఫ‌స్ట్-లుక్ ప్ర‌త్యేకంగా రిలీజ్ చేశారు.




అలాగే ఆ సినిమా ప్రచారానికి ఈ ప్రోమో వదలినా అందులో అన్నింటా ముందు సాయిపల్లవే. “సాయిప‌ల్ల‌వి” ప్రత్యేకించి హైలైట్ అవుతోంది. అంతే కాక పోస్ట‌ర్, మీద ఆమె పేరుకు ఇస్తున్న ప్రాధాన్యం కూడా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. “విరాట‌ప‌ర్వం” సినిమా కు సంబంధించి ఏ పోస్ట‌ర్ వ‌దిలినా ముందు సాయిప‌ల్ల‌వి పేరు వేసి, త‌ర్వాత రానా పేరు వేసేలా చూస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "కోలు కోలు" పాట పోస్ట‌ర్లోనూ సాయిప‌ల్ల‌వి నే ముందుంచారు.




ఈ గౌర‌వం అంద‌రు హీరోయిన్ల‌కూ ద‌క్క‌దు. గతంలో విజయశాంతి, అనుష్క శెట్టి - ఇంకా ముందు రోజుల్లో సావిత్రి, జమున - లాంటి వాళ్లకు మాత్రమే దక్కాయి. అంటే ఈ సినిమాలో రానా కంటే సాయిప‌ల్ల‌వి పాత్రే కీల‌కం అన్న‌మాట‌. సినిమాలో అలా ఉన్న‌ప్ప‌టికీ మ‌న భారత చలనచిత్ర పరిశ్రమ సంప్ర‌దాయం ప్ర‌కారం చూస్తే హీరో పేరే ముందుంటుంది…. ఇక్కడ మాత్రం సంథింగ్ స్పెషల్.




“రానా” కూడా చిన్న హీరో ఏమీ కాదు. బాహుబ‌లి తో అంత‌ర్జాతీయ గుర్తింపు సంపాదించాడు. హీరో గా అత‌డి కంటూ అతని మార్కెట్ కూడా ప్రత్యేకంగానే కాదు విభిన్నంగా ఉంది. అంతటి కథానాయకుడు పేరు వెనుక ఉండ‌టానికి అంగీకరించటం గొప్పవిషయమా! సింప్లిసిటీనా! మగువలను గౌరవించటమా! ఏమో! అంతా ఒకింత ఆశ్చర్యం కలిగించటం లేదా! లేదా కథ మొత్తం ఈ పాత్ర చుట్టూ తిరుగుతుందేమో?




ఈ సినిమాను నిర్మిస్తున్న‌ది కూడా రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు, అంటే రానా సొంత బ్యానర్. ఆయ‌న కూడా కొడుకు పేరు పోస్ట‌ర్, ప్రోమోలు, టీజర్లు, ఇలా ప‌డేలా ఒప్పుకోవ‌డం మరి గొప్ప విషయం, విశేషమే కదా!




దీన్నిబట్టి న‌టిగా సాయిప‌ల్ల‌వి స్థాయి ఏంటో అంద‌రికీ తెలిసినట్టే. కాబ‌ట్టి అత్యంత తీవ్రమైన, లోతైన, నటనకు అవకాశం ఉన్న, కథాంశం కావచ్చు. లేకుంటే సాయి పల్లవి లాంటి గ్రేట్ యాక్ట్రెస్ ఎందుకు? ఏ రష్మిక మందనో? ఏ పూజ హెగ్డే నో? సరిపోతారు కదా! అంటున్నారు సినీ విమర్శకులు. ఈ సినిమా ఆమె కెరీర్లో మ‌రో మైలురాయి అవుతుంద‌ని భావిస్తున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: