ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు దాటిపోయినా ఈ దర్శకుడు నుంచి వచ్చిన సినిమాల సంఖ్య చాల తక్కువ. ఇలాంటి పరిస్థితులలో నితిన్ లాంటి ఒక కమర్షియల్ హీరోతో ఈ దర్శకుడు ఎంతవరకు కమర్షియల్ సక్సస్ అందుకుంటాడు అన్న విషయమై వస్తున్న సందేహాలకు ఈరోజు సాయంత్రానికి పూర్తి రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉంది.
ఈ పరిస్థితుల నేపధ్యంలో ఈ దర్శకుడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎంతవరకు పూర్తి కమర్షియల్ సినిమాలు తీయగలను అన్న విషయాలను చెక్ చేసుకోవడానికి తాను ఈ ‘చెక్’ తీసాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. దీనితో ‘భీష్మ’ లాంటి సూపర్ కమర్షియల్ సక్సస్ తరువాత నితిన్ చంద్ర శేకర్ ఏలేటి ప్రయోగంలో చిక్కుకున్నాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.
అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండి కూడ ప్రేక్షకులలో ఆసక్తి రేపింది. ముఖ్యంగా టీజర్ ట్రైలర్స్ తో సినిమా పై అంచనాలు పెరిగి ఈ సినిమాలో ఏదో కొత్తదనం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి. దీనికితోడు ఈ సినిమా ప్రమోషన్ కూడ చాలా భారీ స్థాయిలో చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్ర అయిన చెస్ కోచ్ గా నటించిన సాయి చంద్ కెరియర్ కు ఈ సినిమా ఒక మలుపు అవుతుందని అంచనాలు వస్తున్నాయి. బాలీవుడ్ టాప్ యాక్టర్ నసీరుద్దీన్ షా లాంటి గొప్పనటుడు చేయవలసిన పాత్ర గోపీ చంద్ తో చేయించడం అతడి అదృష్టం అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి