కొంత మంది మొహం చుస్తే నవ్వు వస్తుంది. మరికొంత మంది ముఖ చిత్రికలను చుస్తే నవ్వు వస్తుంది. ఇక  ఈ మధ్య మన తెలుగులోకి ‘మీమ్స్’తో తో పాటు వీడియోల రూపంలో వస్తోంది. కడుపుబ్బా నవ్విస్తున్నాడు ఈ చిన్నోడు.. ఎక్కడివాడో ఈ బుడ్డోడు భలే గున్నాడే.. అనుకుంటూ మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ అల్లరి గడుగ్గాయి.. బుడ్డోడు కాదు.. పెద్దోడే.. చూడ్డానికి 12ఏండ్ల పిల్లగాడిల కనిపించే నవ్వించే బుడతడి వయస్సు 38సంవత్సరాలు. అతడి గొప్పతనమెంటో తెలుసుకుందామా.

అయితే మీమ్స్ కింగ్ పేరు ఒసిటా ఇహెమ్. 1982 ఫిబ్రవరి 20 న నైజీరియాలోని ఇమో స్టేట్లోని ఎంబైటోలిలో పుట్టాడు. అబియా స్టేట్‌లో పెరిగాడు. లాగోస్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చదివాడు. ఒసిటా ఇప్పటికీ 38ఏండ్లు ఉన్నా పొట్టిగా ఉండడమే అతడికి ప్లస్ అయ్యింది. టాప్ మోస్ట్ కమెడియన్గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టింది.

అయితే ఒసిటా యాక్టింగ్ తొలినాళ్లలో చాలానే కష్టపడ్డాడు. అయితే 2003లో అతను అకినా ఉక్వా అనే హాస్య చిత్రంలో చినేడు ఇకెడీజ్‌ అనే లేడీ కమెడియన్తో కలిసి నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇందులో అతను పావ్‌పా పాత్ర పోషించాడు. ఈ పాత్రలో ఒసిటా ఒక కొంటె(మన భాషలో తీట) పిల్లాడి పాత్ర పోషించాడు. ఇది బాగా ఫేమస్ అవ్వడంతో తర్వాత ఎన్నో చిత్రాల్లో చిన్నపిల్లాడి పాత్రలనే పోషించాడు. చినేడు ఇకెడీజ్, ఒసిటాలు నాలీవుడ్ లో బెస్ట్ కమెడియన్ పేయిర్గా పేరుగడించారు. మన రాజబాబు–రమాప్రభ, బ్రహ్మనందం–శ్రీలక్ష్మిలాగా అన్నమాట.

ఇక ఇతడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ యాక్షన్తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పనిలేదు బ్రో.. అంటూ ఒసిటా నిరూపిస్తున్నాడు. మీరు ఎంత బాధలో ఉన్నాసరే.. ఒకసారి ఒసిటా ఉన్న మీమ్స్నో, వీడియోనో చూడండి.. వెంటనే మీరు రీఫ్రెష్ అవుతారు. ‘‘జీతం వచ్చిన మొదటి రోజు మనిషి ఎంత ఆనందంగా ఉంటాడో.. రెండు రోజులకే జీతం మొత్తం అయిపోతే మనిషి ఎలా ఉంటాడో.. ’’ఒసిటా చేసిన వీడియో ఒకటి ఉంటుంది.. చూస్తే నవ్వి నవ్వి పొట్టపట్టుకోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: