టాలీవుడ్ సినీ నటి రాశి ఖన్నా గురించి అందరికీ తెలిసిందే. తొలిసారిగా హిందీ చిత్రం లో సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాలో హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యింది. తన అందంతో అభిమానులను మెప్పించి వరుస సినిమాలలో అవకాశాలను సొంతం చేసుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది.

2014లో మనం సినిమాలో అతిథి పాత్రలో నటించిన రాశి ఖన్నా తరువాత వరుస సినిమాలలో నటించి హిందీ, మలయాళం భాషలో కూడా నటించింది. దాదాపు 21 పైగా సినిమాలలో నటించగా.. గతేడాది వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో చేయగా ఆ సినిమా అంత విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం రాశికి తెలుగులో ఎటువంటి అవకాశాలు లేకపోయేసరికి.. బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తన లవ్, లైఫ్ సీక్రెట్స్ ను అభిమానులతో పంచుకుంది.

కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొనగా.. తను ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నానని పలుమార్లు తెలిపింది. తాజాగా తన లవ్, లైట్ కి సంబంధించిన సీక్రెట్స్ తెలుపుతూ నెఫ్యూ కి చెందిన చిన్నపిల్లాడి తో దిగిన ఫోటో ను పంచుకుంది. ఇందులో 'లవ్ అండ్ లైట్ ఆఫ్ మై లైఫ్' అని పేర్కొంది. దీంతో ఈ అబ్బాయి పేరు నీల్ అని చెబుతూ, నెఫ్యూ లవ్ అని తెలిపింది. దీని ప్రకారం ఇంకా ఆమె ఎటువంటి లవ్ లైఫ్ లో అడుగు పెట్టలేదని అర్థమైంది. ఇక తను స్విమ్మింగ్ పూల్ దగ్గర బికినీ ఫోజ్ తో ఉన్న ఫోటోను షేర్ చేయగా వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం తుగ్లక్ దర్బార్, అరన్మనై 3, మేథావి సినిమాలో నటిస్తుండగా.. మలయాళంలో ఓ సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: