సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటే ప్రేక్షకుల్లో ఎంతలా  అంచనాలు పెరిగిపోతాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దాదాపుగా అందరు స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు జక్కన్న. అయితే ఒకప్పుడు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే జక్కన్న సినిమాలకు క్రేజ్ ఉండేది కానీ బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు ఎంతగానో ఎదురు చూసే  అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇలా ప్రస్తుతం రాజమౌళి సినిమాకు అంతకంతకు క్రేజ్ ఏర్పడుతుంది.



 అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా తెరకేక్కబోతుంది ఎన్నో రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దీనిపై అసలు సిసలైన క్లారిటీ మాత్రం లేకపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్  అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. సినిమా పూర్తవ్వగానే మహేష్ బాబు తో సినిమా ఉండబోతుంది అని అర్థమవుతుంది. కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తుంది. ఇకపోతే..  ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ బాబు రాజమౌళి తో సినిమాకు ముందు మరో సినిమా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్  సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి.. ఈ సినిమా పూర్తి చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది.



 ఇక అంతలోపే మరో సినిమాను పట్టా లెక్కించాలని మహేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కే  అవకాశముందని ఆ లోపు మరో సినిమాలో మహేష్ బాబు నటించి  ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమాలో తనకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి మరోసారి సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నాడట. ఇక ఈ సినిమాపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలే పెంచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: