సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈయన.ఒకప్పుడు మంచి కంటెంట్ వున్న సినిమాలతో సినిమాలతో ఇండస్ట్రీని ఏలాడు."శివ", "దెయ్యం","రాత్రి", క్షణక్షణం", "రక్త చరిత్ర" లాంటి సినిమాలు తెరకెక్కించి మంచి ప్రతిభ గల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన 'శివ' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో గొప్ప సినిమాలలో బెస్ట్ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోతుంది..అటు నాగార్జున కెరీర్ లో ఇటు వర్మ కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం ఇది. అంత ప్రతిభ గల డైరెక్టర్ వర్మ. వరుసగా వివాదస్పదమైనా చిత్రాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కాని సక్సెస్ పరంగా కాదు వివాదాల పరంగా దూసుకుపోతున్నాడు. తాజాగా మాఫియా నేపథ్యంలో మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు వర్మ. అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తీసిన చిత్రమే డీ కంపెనీ. హిందీ ట్రైలర్‌ను బుధవారమే రిలీజ్‌ చేసిన ఆయన తాజాగా నేడు(శుక్రవారం) తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశాడు.

సాగర్‌ మాచనూరు నిర్మిస్తున్న ఈ సినిమాకు పౌల్‌ ప్రవీణ్‌ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది.ఇందులో దావూద్ ఇబ్రహీం చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడనేది చూపించారు.మనం పైకి రావడానికి ఛాన్స్‌ ఉంది, రిస్క్‌ కూడా ఉంది అంటూ ట్రైలర్‌ ప్రారంభమైంది.తుపాకీల మోత, కత్తులతో నరుక్కోవడాలు.. చూస్తుంటే రక్తపాతాలు, బీభత్సాలు, హింస విపరీతంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ కొన్నిచోట్ల పాత పద్ధతులనే రిపీట్‌ చేస్తూ రొటీన్‌ అనిపిస్తోంది. శివ, రక్త చరిత్ర లాంటి సెన్సేషనల్ సినిమాలు తీశాడు రామ్ గోపాల్ వర్మ ఇందులో వర్మ మార్క్‌ పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. ఇక చూడాలి ఈ సినిమాతోనైనా రామ్ గోపాల్ వర్మ సరైన హిట్ అందుకుంటాడో లేదో....

మరింత సమాచారం తెలుసుకోండి: