కథ అవసరాన్ని బట్టి బాడీ సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం హీరోయిన్స్ చేస్తూ ఉంటారని డానికి మీడియా చాల ప్రాధాన్యత యిస్తూ వార్తలు వ్రాయడమే కాకుండా జీరో సైజ్ లో ఒక హీరోయిన్ కనిపించడం ఒక అద్భుతంగా ఎందుకు చూస్తారో తనకు అర్ధం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నిత్యామీనన్.

ఈ సంవత్సరపు సమ్మర్ హీరోయిన్ గా టాలీవుడ్ కోలీవుడ్ లను షేక్ చేసిన నిత్యామీనన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బాడీని తగ్గించుకోవడం పెంచుకోవడం అన్నీ తన చేతులలోనే ఉన్నాయి అని అంటూ చాలామంది హీరోయిన్స్ లాగా తనకు జీరో సైజ్ తెచ్చుకోవడానికి జిమ్ములు చుట్టూ తిరుగుతూ కాలం వృథా  చేసుకోవలసిన పని తనకు లేదు అంటూ నేటి గ్లామర్ హీరోయిన్స్ పై సెటైర్లు వేసింది నిత్యామీనన్. 

ప్రస్తుతం దక్షిణాది సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నిత్య బాలీవుడ్ సినిమా రంగం గురించి మాట్లాడుతూ అన్నీ కుదిరితే తాను బాలీవుడ్ కు వెళ్ళడానికి రెడీ అంటోంది. అంతేకాదు తనకు పారితోషికం ముఖ్యం కాదని సినిమాలోని తన పాత్రలు ముఖ్యం అని అంటూ పారితోషికం కోసమే అయితే ఈ పాటికి తాను కూడ చాల సినిమాలు చేసి ఉండే దానిని అనీ మళ్ళీ గ్లామర్ హీరోయిన్స్ ను టార్గెట్ చేసింది నిత్య.

సెప్టెంబర్ 4న విడుదల కాబోతున్న ‘రుద్రమదేవి’ సినిమాలో ముక్తాంబ గా కీలక పాత్ర పోషిస్తున్న నిత్యామీనన్ ఆ సినిమాలోని తన పాత్ర తనకు చాల పేరు తెచ్చి పెడుతుంది అని అంటోంది. ఏది ఎలా ఉన్నా నిత్యామీనన్ జీరో సైజ్ బ్యూటీల పై వేసిన సెటైర్లు హాట్ టాపిక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: