పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ళ విరామం తారువత మళ్ళీ సినిమాల్లోకి " వకీల్ సాబ్ " తో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రోజు నుండే హిట్ టాక్ సొంతం చేసుకొని టాప్ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా పై మొదటి రోజే "డిజాస్టర్ వకీల్ సాబ్ " ట్విట్టర్ లో ట్రెండింగ్ నడిచింది. అయితే పవన్ మ్యానియా ముందు ఈ నెగిటివ్ రివ్యూస్ నిలబడలేకపోయాయి. దీంతో మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది " వకీల్ సాబ్" మూవీ.

 రెండు తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ కలిపి 32 కోట్ల షేర్, 44 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక రెండవ రోజు కాస్త పరిస్థితి బిన్నంగా కనిపించింది. అక్కడక్కడ మిక్సుడ్ టాక్ రావడం గమనార్హం. అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు.. సినిమాలో ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాకు బాగా నెగిటివ్ గా మారాయి. 

అయితే ప్రస్తుతం సినిమాకు ఉన్న హైప్ చూస్తుంటే మిక్సుడ్ టాక్ వచ్చినప్పటికి సినిమా కలెక్షన్లపై ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో " వకీల్ సాబ్ " సినిమా వారం గడిచేసరికి కొత్త రికార్డులను సెట్ చెయ్యడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పవన్ క్రేజ్ బట్టి ఆయన సినిమాలు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా భారీ వసూళ్లను రాబడుతూ ఉంటాయి. ఆ లెక్కన "వకీల్ సాబ్ " కు మిక్సుడ్ టాక్ వచ్చినప్పటికి కలెక్షన్ల పరంగా అన్నీ రికార్డులకు చెక్ పట్టే అవకాశమే కనిపిస్తుంది. మరి "వకీల్ సాబ్ " ఎలాంటి హిట్ నమోదు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.   .

మరింత సమాచారం తెలుసుకోండి: