సినిమాలు ఎన్ని వచ్చినా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాల పాపులారిటీ వేరు. రియల్ హీరోలైన వీరిగురించి సినిమా గా తీయాలంటే ఎంతో ఇన్ఫర్మేషన్ తో పాటు, ఎన్నో గట్స్ కూడా ఉండాలి. ఈ పాత్రలు, ఈ సినిమా చేయడానికి హీరో లుఎంతో ఆశపడుతుంటారు.ఆ సినిమా హిట్ అయితే దేశానికి ఎంతో సేవ చేసినట్లే అని ఫీల్ అవుతుంటారు. మెసేజ్ ఓరియెంటెడ్  సినిమాలుగా  తెరకెక్కే ఈ సినిమాలు కమర్షియల్ గానూ తీసి హిట్ కొడుతున్నారు. మరీ టాలీవుడ్ లో ఇలాంటి పాత్రలు చేసిన హీరోలు, సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

ఆనాటి హీరోలలో ఈ టైపు సినిమాలు చేసి హిట్ కొట్టిన హీరోల్లో ముందున్న హీరో ఎన్టీఆర్..బొబ్బిలి పులి చిత్రం ఆర్మ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా ఈ సినిమా 1982 విడుదలై ఈ సినిమా మంచి విజయ సాధించింది. ఏఎన్నార్ జైజవాన్ చిత్రం 1970లో విడుద‌ల అయి అప్పట్లో ఒక ట్రెండ్ ను సృష్టించింది.కెప్టెన్ ర‌వీంద్ర క్యారెక్ట‌ర్ లో అక్కినేని అదరగొట్టాడు. మెగా స్టార్ చిరంజీవి ఆర్మీపాత్ర లో నటించి ఈ తరం హీరోలకు ఆ సినిమాలు చేయడానికి మార్గదర్శి అయ్యాడు. స్టాలిన్ సినిమా లో చిరు భార‌త్‌లోకి చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నించిన పాక్ సైన్యాన్ని ఆయ‌న త‌రిమికొడ‌తాడు.

ఇక బాలకృష్ణ నటించిన విజయేంద్ర వర్మ,నాగార్జున నటించిన గగనం, జగపతి బాబు పటేల్ సర్, రాజశేఖర్ ఆగ్రహం, మహేష్ బాబు సరిలేరునీకెవ్వరు,అల్లు అర్జున్ నా పేరు సూర్య, వంటి సినిమాలు ఈనేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ గానిలిచాయి. ఇక బాలీవూడ్ లో వచ్చిన ఉరి సినిమా ఎవ్వరు మర్చిపోలేరు. ఈ సినిమాలో  విక్కీ కౌష‌ల్ పారా మిల‌ట‌రీ క‌మెండో టీంకు నాయ‌క‌త్వం వ‌హిస్తాడు.పాకిస్తాన్ లోపలికి వెళ్లి ఉగ్ర‌వాదుల లాంచ్ పాడ్స్‌పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేస్తారు.ఈ సినిమాలో ఆయ‌న న‌ట‌న‌కు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు ద‌క్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: