పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీకపూర్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అంజలి, నివేద థామస్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఇక సినిమాసక్సెస్ కొట్టడంతో పలువురు ప్రేక్షకులతోపాటు సినిమా ప్రముఖులు సైతం హీరో పవన్ సహా వకీల్ సాబ్ యూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సినిమా రిలీజ్ అనంతరం తిరుపతి ఎలక్షన్స్ కోసం కొన్ని రోజులు అక్కడ పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ నిన్న కోవిడ్ బారినపడ్డారు. అంతకు ముందు రోజు నుండి పవన్ పూర్తిగా ఒళ్లునొప్పులు, జ్వరం వంటి సింప్టమ్స్ రావడంతో వెంటనే ఆయనకి పలువురు వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అందించడంతో పాటు కొవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ అని తేలిందని ప్రస్తుతం ఆయన అందరికీ దూరంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారంటూ జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పవన్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ కి కూడా కొద్ది రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ రావడంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.

అయితే వీరిద్దరూ ఆడుతోంది నాటకమని ప్రస్తుతం తిరుపతి ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అలానే ఆయన భక్తుడు బండ్ల గణేష్ ఇద్దరు కూడా  ఎలక్షన్ పై సానుభూతి కోసం ఇలా ప్లాన్ వేశారు అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో పై పలువురు పవన్ ఫ్యాన్స్ స్పందిస్తూ పవన్ కు అలానే బండ్లకు అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదని దయచేసి వారి గురించి తప్పుగా మాట్లాడకండి అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా శ్రీరెడ్డి పై ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: