ఇక పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు విరామం దొరకడంతో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక దాదాపు మూడు సంవత్సరాల తరువాత "వకీల్ సాబ్ " సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి పవన్ కి మంచి కంబ్యాక్ హిట్ ని ఇచ్చింది.ఇప్పటికే 80 కోట్ల షేర్ వసూళ్ళని సాధించిన ఈ సినిమా మరో 10 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక  తాజాగా పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. పవన్ కరోనా బారిన పడటం ఆయనను అభిమానించే కోట్లాదిమంది అభిమానులను షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన ఫార్మ్ హౌస్ లో చికిత్స చేయించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ త్వరగా కోలుకోవాలని పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. వకీల్ సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే పవన్ కు కరోనా సోకి ఉండవచ్చని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వకీల్ సాబ్ సినిమా నిర్మాత దిల్ రాజు, వకీల్ సాబ్ ఈవెంట్ కు హాజరైన బండ్ల గణేష్ కు కూడా కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ త్వరగా కోలుకోవాలని గుడికి వెళ్లి పూజలు చేస్తున్నారు.పవన్ కి త్వరగా కరోనా నెగటివ్ రావాలని ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగా అయ్యి మునుపటి లాగే సినిమాలు చేసుకుంటూ హుషారుగా దూసుకుపోవాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఇక పవన్ త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీ లో పలువురు ప్రముఖులు కోరుకోవడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: