సినిమా కోసం పనిచేసేవారు కొంతమంది అయితే సినిమానే ప్రాణంగా పనిచేసేవారు చాలామంది ఉన్నారు మన దేశ సినిమా పరిశ్రమలో.. ఎప్పుడెప్పుడు ప్యాకప్ అయిపోద్దా అని చూసే హీరోలు ఉన్న ఈ పరిశ్రమలో సినిమాపైనే ఫోకస్ పెట్టి పనిచేసే హీరోలు కూడా ఉన్నారు.. వారు ఎలాంటి పాత్రనైనా తమ దైన స్టైల్ లో చేసి ప్రేక్షకులను మెప్పిస్తారు.. అయితే ఆ పాత్ర కోసం వారు చేసే కసరత్తు అంతా ఇంతా కాదు. ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఇలాంటి నటులకు ఓ ఛాలెంజింగ్ రోల్ గురించి చెబితే.. దానికి జీవం పోస్తారు అని వారు చేసే పనులను బట్టి తెలుస్తుంది.

అలాంటి నటుల కోవలోకి వస్తాడు కిక్ సినిమాలో నటించిన శ్యామ్.. టాలీవుడ్ లో అయన నటించిన కిక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. రవితేజ నటించిన ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ద్వారా మరిన్ని అవకాశాలు పొందాడు శ్యామ్..   పలు తెలుగు సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించి తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యాడు శ్యామ్. ఇకపోతే తాజాగా తనకు తగ్గ ఓ ఛాలెంజింగ్ రోల్ లో నటించి ప్రేక్షకులను అలరించబోతున్నాడు శ్యామ్..

సదరు పాత్ర ప్రకారం కళ్ళు చిన్నవిగా ఉండాలట.. వాటి కింద గడ్డలు రావాలట.. దీనిని గ్రాఫిక్స్ లో మేనేజ్ చేయవచ్చు. మేకప్ టీంకు చెబితే గంటలో ఆ లుక్ లోకి తీసుకెళ్లి పోతారు.  కానీ ఇది అందరు సాధారణ నటులు చేసే పని.. శ్యామ్ ఎందుకు చేస్తాడు..అలా చేస్తే న్యాచురల్ లుక్ రాదని, ఏకంగా దానికి కఠినమైన సాధన చేశాడట..  ఏకంగా 9 రోజులు నిద్ర మానేసి ఈ లుక్ లోకి వచ్చాడట. ఆయన లేటెస్ట్ లుక్ ను చూస్తే గుర్తుపట్టలేని విధంగానే కాదు భయపెట్టే విధంగా కూడా కనిపిస్తున్నాడు. ఏమైనా ఇతని డెడికేషన్ కు హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే. మరి ఈ రోల్ ద్వారా కిక్ శ్యామ్ ఆస్కార్ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: