నిన్న జరిగిన విజయ్ దేవరకొండ పుట్టినరోజునాడు సినీ ప్రముఖులతో పాటు వేల సంఖ్యలో అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేసారు. అనేకమంది ఫిలిం సెలెబ్రెటీలు విజయ్ దేవరకొండతో తమకు ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. దీనితో నిన్న షోషల్ మీడియా అంతా విజయ్ పుట్టినరోజు వేడుకల హంగామా శుభాకాంక్షలు హైలెట్ గా నిలిచాయి.


వాస్తవానికి విజయ్ ని అభినందిస్తూ అనేకమంది సెలెబ్రెటీలు శుభాకాంక్షలు తెలియచేసినా ఛార్మీ శుభాకాంక్షల సందేశం మటుకు విజయ్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. రౌడీ స్టార్ ను 26 క్యారెట్ బంగారంగా ఛార్మీ అభివర్ణించింది. వాస్తవంగా ప్రపంచ వ్యాప్తంగా 24 క్యారెట్ బంగారం ఉంటుంది కానీ 26 క్యారెట్ బంగారం ఉండడు. దీనితో విజయ్ కొత్త బంగారంతో మెరిసిపోయే గోల్డ్ మ్యాన్ గా మారిపోయాడు.  


ప్రస్తుతం ఛార్మీ పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి ఈమూవీ ప్రారంభం అయి చాలాకాలం అయినప్పటికీ కరోనా పరిస్థితులు కారణంగా ముందుకు సాగడంలేదు. ఈమూవీలో సన్నివేశాలు ఎక్కువగా ముంబాయి నేపధ్యంలో ఉండటంతో ఇప్పట్లో ఈమూవీ యూనిట్ ముంబాయ్ వెళ్ళే పరిస్థితి కనిపించడంలేదు. దీనితో హైదరాబాద్ లో ముంబాయ్ వాతావరణాన్ని ప్రతిబింబించే ఒక సెట్ వేసి ఈమూవీ షూటింగ్ ను ముందుకు నడిపించాలని పూరీ అనుకున్నాడు.



అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అడ్డు తగిలి షూటింగ్ లు ఆగిపోవడంతో ఈమూవీ అనుకున్న విధంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ లో విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు అని అంటున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న పరిస్థితులలో దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత నవంబర్ ప్రాంతంలో విడుదల అయ్యే ఆస్కారం ఉంది. ఈ మూవీ విజయం విజయ్ దేవరకొండ కెరియర్ కు అత్యంత కీలకం కావడంతో ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని పూరి ఆలోచన..


మరింత సమాచారం తెలుసుకోండి: