టాలీవుడ్ సినిమా హీరోలు తమ దగ్గర పనిచేసే వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా చెప్పాలంటే తన ఇంట్లో మనిషిలాగ చూసుకుంటారు. అలాంటివారికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు మన టాలీవుడ్ హీరోలు. అలా  మన స్టార్ హీరోలు ఏకంగా లగ్జరీ కార్లను బహుమతులుగా ఇచ్చారు. అలాంటి వారు ఎందరు ఉన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1). ప్రభాస్: తన దగ్గర ఫిట్ నెస్ ట్రైనర్ గా పనిచేస్తున్న వ్యక్తికి ఒక మంచి లగ్జరీ కారును కొనిచ్చాడు. దాని ధర రూ.85 లక్షలు ఉంటుందట.
2). నాగ శౌర్య: ఛలో సినిమా లో హీరో గా చేశాడు నాగశౌర్య. ఈ సినిమా విజయం సాధించడంతో తన తల్లిదండ్రులకు కోటి రూపాయల కారును బహుమతిగా ఇచ్చాడు.
3). నితిన్: తన కెరీర్ డల్ గా ఉన్నప్పుడు ఇబ్బంది పడుతున్న టైంలో వెంకీ కుడుముల  భీష్మ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు. దానికి గుర్తుగా నితిన్ వెంకీకి రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు.
4). రామ్ చరణ్: తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 59 వ పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కారు కొని  బహుమతిగా ఇచ్చాడు. ఈ కారు విలువ అక్షరాల కోటి రూపాయలు ఉంటుందట.
5). నమ్రతా శిరోద్కర్: సూపర్ స్టార్ మహేష్ బాబు 35 వ పుట్టినరోజు సందర్భంగా తన భార్య నమ్రత రేంజ్ రోవర్ కారు ను  గిఫ్ట్ గా ఇచ్చిందట.

6). మహేష్ బాబు : మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనకు చెప్పనక్కరలేదు. దానికి బహుమతిగా ఒక ఆడి కార్ ను కొరటాల శివకు గిఫ్ట్ గా ఇచ్చాడట మహేష్ బాబు.

ఇక వీరందరూ కాకుండా మరికొంత మంది నటీనటులు తమ దగ్గర పనిచేసే వ్యక్తులకు ఇండ్లు, పిల్లల చదువులు, వివాహాలు చేయించిన వారు ఇలా చాలా మంది ఉన్నారు. సాయం చేసి బయటకు చెప్పుకొనేవారు మరికొంత మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: