ఇక రెండవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ వున్నాడు.ఇక గతేడాది సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో మంచి మాస్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 238 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. ఇప్పటికీ సూపర్ స్టార్ తో కలిసి సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మహేశ్ తన రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేశారు. 40 కోట్లు తీసుకునే ఆయన ఇప్పుడు ఒక్క సినిమాకు 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల తరువాత "వకీల్ సాబ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'వకీల్ సాబ్' చిత్రానికి 50 కోట్లు అందుకున్నాడు.ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు 35 కోట్లు అందుకుంటున్నాడని సమాచారం.ఇక రామ్ చరణ్ చివరగా నటించిన 'వినయ విధేయ రామ' ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆర్ఆర్ఆర్ ద్వారా తిరిగి తన సత్తా ఏంటో చూపేందుకు ఆయన రెడీ అయ్యారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌తో సమానంగా 35 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ 'పుష్ఫ' సినిమా కోసం 30 కోట్లు అందుకున్నట్లు వినికిడి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి