మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాటకు సంబంధించిన టీజర్ లేదా ఫస్ట్ లుక్ 2021, మే 31వ తేదీన అనగా
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. దర్శకుడు
పరశురామ్, చిత్ర బృందం కలిసి
సూపర్ స్టార్ కృష్ణ 78 వ పుట్టినరోజు సందర్భంగా.. సర్కారు వారి పాట నుంచి
మహేష్ కి సంబంధించిన అదిరిపోయే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ విడుదలై అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
సోషల్ మాధ్యమాల్లో ఇప్పటికే సర్కారు వారి పాట
మూవీ అప్డేట్ కి సంబంధించి హ్యాష్ టాగ్స్ హల్ చల్ చేస్తున్నాయి. అయితే
మహేష్ బాబు అభిమానులు మాత్రం
కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట టీజర్ విడుదల చేయాలని
మూవీ యూనిట్ ని కోరుతున్నారు. మరి టీజర్ విడుదల అవుతుందో లేక
మహేష్ బాబు లుక్ విడుదల అవుతుందో తెలియాలంటే మే 31వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాకి
పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా..
దేవిశ్రీప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు.
ఈ సినిమాను మినహాయించి
మహేష్ బాబు
త్రివిక్రమ్ తో కలిసి మరో
సినిమా చేయనున్నారు.
కృష్ణ పుట్టినరోజు సందర్భంగా
మహేష్ -
త్రివిక్రమ్ కాంబో
మూవీ టైటిల్ కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే రోజున ఈ సినిమాకు సంబంధించిన
పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. "అతడు", "ఖలేజా" తరువాత
మహేష్ బాబు,
త్రివిక్రమ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోంది.
ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో
మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత
మహేష్ బాబు మూవీలకు సంబంధించిన షూటింగ్స్ ప్రారంభమవుతాయి.