అల్లరి నరేష్ తన సినీ ప్రస్థానం ప్రారంభించి దాదాపు 20 సంవత్సరాలు కావస్తోంది. అయితే ఈ 20 సంవత్సరాల్లో ఆయన ఎన్నో కామెడీ చిత్రాలు చేశారు. అలాగే "పెళ్లయింది కానీ", "నేను" వంటి ఎమోషనల్ డ్రామా చిత్రాల్లో కూడా చక్కని నటన కనబరిచి వావ్ అనిపించారు. ప్రస్తుతం అతను కంటెంట్ డ్రైవన్ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ఆయన కెరీర్ లో వచ్చిన సినిమాల్లో ఉత్తమ కామెడీ చిత్రం ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

నరేష్ తన సినీ ప్రస్థానాన్ని అల్లరి(2002) సినిమాతో మొదలు పెట్టారు. అయితే నరేష్ మొట్టమొదటిగా నటించిన కామెడీ చిత్రమే.. ఉత్తమ చిత్రంగా ఆయన కెరీర్ లో ఇప్పటికీ నిలుస్తోంది. ఈ చిత్రంలో కామెడీ మాత్రమే కాదు మనసును హత్తుకునే లవ్ ట్రాక్ కూడా ఉంది. ఈ చిత్రంలో పద్దెనిమిదేళ్ల అమాయకపు అబ్బాయి గా అల్లరి నరేష్ నటించగా.. అతడిని మనసారా ప్రేమించే అమ్మాయిగా శ్వేతా అగర్వాల్ నటించారు. ఐతే నరేష్ మాత్రం ఆమెని స్నేహితురాలు గా మాత్రమే చూస్తాడు. ఈ విధంగా వీరిద్దరి మధ్య కొన్ని భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. ఈ సినిమాలో నరేష్ తండ్రి మహా పిసినారి కావడంతో శ్వేతా అగర్వాల్ మీదనే నరేష్ ఆధారపడుతుంటారు. అయితే ఈ చిత్రంలో చాలా సహజంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు నరేష్. శ్వేతా అగర్వాల్ కుందనపు బొమ్మలా ఉండి ప్రేక్షకుల హృదయాలను దోచేస్తే.. నీలాంబరి తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల మతులు పోగొట్టారు.

దర్శకుడు రవిబాబు ఈ చిత్రంలోని ప్రతి క్యారెక్టర్ ని చాలా చక్కగా పరిచయం చేశారు. అలాగే అడల్ట్ కామెడీ జానర్ ని టచ్ చేయకుండా అల్లరి సినిమాని ఓ మంచి కుటుంబ కథా చిత్రంగా రూపొందించారు. అప్పట్లో ఈ సినిమాని థియేటర్ లో చూసిన ప్రేక్షకులు ఫస్టాప్ అంతా కడుపు చెక్కలయ్యేలా నవ్వారంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో వచ్చిన అన్ని సినిమాలకు చాలా వైవిధ్యంగా, సృజనాత్మకంగా తీసిన అల్లరి సినిమా టాప్ బెస్ట్ కామెడీ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: