సాధారణంగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం నిజజీవితానికి దగ్గరగా ఉంటూ ప్రేక్షకులకు ఎంతో కనెక్ట్ అయి పోతుంటాయి. ఎన్నో రోజుల పాటు ఆ సినిమాలోని ఎమోషన్స్ అటు ప్రేక్షకుల మనసులో నాటుకు పోతుంటాయ్.  ఇలా అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ..  అన్నదమ్ముల మధ్య ఎంత ప్రేమ ఉంటుంది అనే విషయాన్ని చూపిస్తూ తెలుగు ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయిన సినిమా రేసుగుర్రం.  అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి విజయాన్ని సాధించింది.



 ఇక ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్య ఉండే ఎమోషన్స్.. గొడవలు..  ఒకరి కోసం ఒకరు చేసే పోరాటం అటు తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో కనెక్ట్ అయిపోతుంది.  ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్య ఉన్న స్టోరీ అటు నిజజీవితంలో కూడా ఉంటుంది. సాధారణంగా ఒక ఇంట్లో అన్నదమ్ములు చాలా తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరికి ఒకరు పలకరింపులు కూడా తక్కువే. ఎప్పుడైనా మాట్లాడుకున్నా చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదేమో అన్నట్లుగా ఉంటారు.. కానీ ఒకరి కోసం ఒకరు నిలబడాల్సి వస్తే..  ప్రాణాలను పణంగా పెట్టి తమ తోడబుట్టిన వారిని రక్షించుకుంటారు.



 ఇక జీవితంలో జరిగే ఇదే విషయాన్ని అటు దర్శకుడు సురేందర్ రెడ్డి  అద్భుతంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు.  ఈ సినిమాలో తమ్ముడిగా అల్లు అర్జున్.. అన్నగా నటుడు శ్యామ్..  నటిస్తారు. మొదటి నుంచీ ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు వీరిద్దరు. ఇలాంటి సమయంలోనే ఇక పోలీస్ గా పనిచేస్తున్న తన అన్నకి ప్రమాదం ఉంది అని భావించిన  తమ్ముడు..  ఇక తన అన్నని చంపాలి అనుకుంటున్న విలన్ను ఒక ఆట ఆడుకుంటాడు. అంతేకాదు అన్నదమ్ములు మాట్లాడక పోయినప్పటికీ ఆ కనెక్షన్ మాత్రం  ఎప్పుడూ ఉంటుంది అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ లు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయి పోతూ ఉంటాయి. ఇలా అన్నదమ్ముల మధ్య ఉన్న ఎమోషన్స్ కళ్లకు కట్టినట్టుగా చూపించడంతో ఈ సినిమా ప్రేక్షకులకు తెగ కనెక్ట్ ఎక్కువైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: