సినిమా ఇండస్ట్రీలో కొంత మంది సెలబ్రిటీల పరిచయాలు ఎంత గమ్మత్తుగా జరుగుతూ ఉంటాయి అంటే వారికి తమ భాగస్వామిని కలిశామ ని అప్పటి కి తెలియదు కా నీ భవిష్యత్తులో వారిద్దరు భార్యాభర్త లు ఉంటారు. ఎంతో విచిత్రంగా జరిగిన పరిచయాలు ఇంకా ఎంతో వైవిధ్యంగా కలుసుకున్న చోటు వారిని భవిష్యత్తులో ఒకటి చేస్తుంది. ఆ విధంగా ఓ హీరో తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయనెవరో కాదు డబ్బింగ్ సినిమాలతో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు, తమిళ హీరో విజయ్ ఆంటోని.

తమిళనాట పలు చిత్రాలలో లకు సంగీత దర్శకత్వం వహించిన విజయ్ ఆంటోనీ హీరోగా మారి చాలా వైవిధ్యభరితమైన చిత్రాన్ని తెరకెక్కించాడు. తెలుగునాట బిచ్చగాడు అనే సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న విజయ్ ఆంటోని ఆ తర్వాత తన వరుస సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చాడు. 2016లో యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన బిచ్చగాడు సినిమా వాణిజ్యపరంగా ఎంతో విజయవంతమైంది. 40 కోట్ల వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హి ట్ అయ్యింది.

దీంతో తర్వాత చిత్రంగా వచ్చిన బేతాళుడు పై భారీ అంచనాలు నెలకొనగా ఆ సినిమా అనుకున్నంత ఆడలేదు. ఆయన పర్సనల్ విషయాలకు వస్తే విజయ్ ఆంటోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ లో పుట్టాడు. ఆయనకు ఏడేళ్ళ వయసు లో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. చిన్నప్పటి నుంచి సంగీత దర్శకుడిగా అవ్వాలని కలలు కన్నా విజయ్ ఆంటోని 2005లో సంగీత దర్శకుడిగా తన తొలి తమిళ చిత్రం చేశాడు. ఇక ఆయన ఫాతిమా ఆంటోనీ నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి ప్రేమలో పడి ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: