మాస్ రాజా రవితేజ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా క్రాక్. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించగా తమిళ ప్రముఖ నటులు వరలక్ష్మి శరత్ కుమార్ మరియు సముద్రఖని ప్రతి నాయక పాత్రలు పోషించారు. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా ఇటు రవితేజకు అటు శృతి హాసన్ కు ఇద్దరికీ మంచి చిత్రంగా నిలిచింది. 

దర్శకుడు గోపీచంద్ మలినేని రవితేజ కాంబినేషన్లో గతంలో బలుపు,డాన్ శీను సినిమాలు రాగా ఈ చిత్రం తో వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రం వచ్చినట్లయింది. 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి హిట్ గా అయ్యింది. నటుడుగా రవితేజకు ఇది 66 వ చిత్రం కాగా ఈ సినిమాలోని కొన్ని పాత్రలు నిజజీవిత సంఘటనలను ఆధారంగా తీసుకున్నవి కావడం విశేషం. తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. సాయి మాధవ్ బుర్ర పవర్ ఫుల్ డైలాగ్స్ అదిరిపోయాయి. 

ఇటీవల కాలంలో వచ్చిన కాప్ సినిమాలలో ఒక డిఫరెంట్ చిత్రం గా క్రాక్ అభివర్ణించవచ్చు. గతంలో రవితేజ చాలా పోలీస్ నేపథ్యంలోని సినిమాలు చేసిన వాటన్నిటికీ భిన్నంగా ఈ సినిమా తెరకెక్కింది. ఎస్సై వీర శంకర్ గా రవితేజ తన నట విశ్వరూపం చూపించారు అని చెప్పవచ్చు. సినిమాలో శృతి హాసన్ చేసిన ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. వరలక్ష్మి శరత్ కుమార్ లేడి విలన్ గా విలనిజాన్ని పండించింది. సముద్రఖని కటారి కృష్ణ గా అద్భుతంగా నటించాడు. కూర మైన పాత్రలో సముద్రఖని కనిపించాడు. మొత్తానికి కరోనా నేపథ్యంలో మూతపడ్డ థియేటర్లను ఓపెన్ చేయించి విడుదలై సూపర్ హిట్ కొట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరినిచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: