తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో నటుడికి ఒక్కో విధమైన పేరు ఉంది. వారు చేస్తున్న సినిమాలు జనాలకు నచ్చితే వదలరు. అలాంటి అభిమానాన్ని చూరగొన్న ఏకైక నటుడు జగపతిబాబు. సినిమా కెరియర్ మొదట్లో కుటుంబ కథా చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వయస్సు పెరిగిన అతనికి ఉన్న టాలెంట్ వల్ల సినిమా అవకాశాలు మాత్రమే. అన్నగా, తండ్రిగా, తమ్ముడుగా, విలన్ గా నటిస్తూ బిజీగా ఉన్నాడు.


ఇటీవల జగ్గు భాయ్ కేవలం విలన్ పాత్రల్లోనే కనిపిస్తున్నాడు. హీరోగా నటిస్తున్నప్పుడు లేని సంతోషం విలన్ గా చేసినప్పుడు కలిగిందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. నిజానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కనిర్మాత వి.బి. రాజేంద్ర ప్ర‌సాద్ వార‌సుడిగా తెరంగ్రేటం చేసిన జ‌గ‌ప‌తి బాబు వృత్తిప‌రంగా, వ్య‌క్తిగ‌తంగా ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొన్నారు. ఎన్నో బాధలను దిగమింగుకొన్నారట. తన సినీ కెరియర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తాను చూసిన ప్రతి విషయాలని అభిమానులతో పంచుకోవాలని ముచ్చట పడుతున్నారు.


అందులో భాగంగా ఓ కార్యక్రమానికి నాంది పలికారు. ‘స‌ముద్రం: ఇట్స్ మై లైఫ్’ పేరుతో ఓ కార్య‌క్ర‌మం చేయడానికి సిద్ధపడ్డాడు. 59 ఏళ్లుగా త‌న ప్ర‌యాణం ఎలా సాగింది? నటన పట్ల ఆసక్తి ఎప్పుడు కలిగింది... నటుడిగా తానూ ఏ సినిమాలో నటించాడు.. మొదలగు విషయాలను ఈ కార్యక్రమం ద్వారా పంచుకోనున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఓ వీడియోని విడుద‌ల చేశారు జ‌గ‌ప‌తి. ‘‘59 ఏళ్ల క్రితం.. నా జీవితం గురించి మీ అంద‌రితో చెప్పాలనుకుంటున్నా..  సముద్రం ఇట్స్ మై లైఫ్ అంటూ వీడియో లో కనిపిస్తుంది. వెనుక ఆయన వాయిస్ ను అందిస్తున్నారు. ఈ కార్యక్రమం వెనక ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా.. సడెన్ గా ఇలా ఎందుకు చేస్తారు ఇలాంటి సందేహాలు కలుగక మానలేదు. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే.. జూన్ 18 సాయంత్రం 6 గంటలకు ఏం జరుగుతుందో చూడాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: