గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా దూరమై సుమారు సంవత్సరం కావస్తోంది. ఇక ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఆయనకు మరుపురాని ఒక బహుమతి ఇవ్వడానికి ఆయన కుమారుడు శ్రీపతి చరణ్ పండితారాధ్యుల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నినదించు హృదయ రవళి అనే ఒక పాటను తన తండ్రి బాలసుబ్రమణ్యం జ్ఞాపకార్థం పాడి దానిని ఆయన ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఆయన పాడిన అన్ని పాటల్లో నాన్న బతికే ఉన్నారు అని చెబుతున్న చరణ్, అభిమానుల ఆలాపనలో కూడా నాన్న బతికే ఉన్నారని పేర్కొన్నారు. 

పాట అనేది బ్రతికి ఉన్నంతకాలం నాన్నకు మరణం లేదని, ఆయనకు కొడుకుగా పుట్టడం ఒక అదృష్టం అయితే అంతటి గొప్ప వ్యక్తి కొడుకుగా అంతే గొప్పగా బతకాలి అనేది తన ఆశయం అని చరణ్ అభిప్రాయపడ్డారు. ఒక కొడుకుగా ఎంత చేసినా ఆయన రుణం తీర్చుకోలేం అని, ఆయన పాడిన పాటలు, ధరించిన వస్తువులు ఆయనకు ఇష్టమైన వ్యాపకాలు అన్ని ఒక మ్యూజియంలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం అని ఆయన గతంలో వెల్లడించారు. ఓల ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పేరుమీద ఒక పెద్ద మ్యూజిక్ స్కూల్ నెలకొల్పాలని భావిస్తూ అందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 

అంతేకాక నేటి తరానికి రాబోయే తరాలకు నాన్నను మళ్ళీ కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో 50 ఏళ్లలో నాన్న పాడిన అని ముత్యాలు లాంటి పాటలను నేటితరానికి మళ్లీ పరిచయం చేయాలనే ఆలోచన ఉందని ఆయన తన మనసులో మాట వెల్లడించారు.. తాను ఎప్పుడూ ఒక గాయకుడిని కావాలని అనుకోలేదని పేర్కొన్న ఆయన ఒక బిజినెస్ చేద్దామని అనుకున్నా కానీ తను సరదాగా పాడిన కొన్ని పాటలు విన్న తర్వాత నాన్న పాటలు నేర్చుకోమని ప్రోత్సహించడంతో అప్పుడు సీరియస్ గా శ్రద్ధ పెట్టి సంగీతం నేర్చుకున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: