ఆమె భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ. హెచ్ సి ఎల్ కంపెనీ సీఈఓ.. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. విద్య జ్ఞాన్ చైర్ పర్సన్. ఆమె రోష్ని నాడార్ మల్హోత్ర. శివ నాడార్ ఏకైక కుమార్తె. భారతదేశంలో విజయాలు సాధించిన మహిళల గురించి మాట్లాడుకునేటప్పుడు రోషిని గురించి తప్పక చెప్పాలి. కరోనా సమయంలో సమర్థమైన నాయకత్వ లక్షణాలు చూపించిన 25 మంది పారిశ్రామికవేత్తలలో ఈమె పేరు కూడా ఉంది. 38 సంవత్సరాల రోష్ నీ హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ అయ్యారు. అంతకుముందు భారతీయ ఐటీ కంపెనీ నడిపించిన మొట్ట మొదటి మహిళ గా మరో విజయం సాధించి గుర్తింపు పొందారు.

చిన్నతనంనుంచే ఆమె తండ్రి స్థాపించిన సంస్థను చదవడం మొదలు పెట్టింది. హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కు ఏకైక సంతానమైన రోష్ని ఢిల్లీలో 1982 లో జన్మించగా వసంత్ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు.  నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ,  కైలాగ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చేశారు. చదువు పూర్తి కాగానే బ్రిటన్ లో న్యూస్ ప్రొడ్యూసర్ గా ఆరంభించారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ప్రారంభించిన వ్యాపారంలో భాగస్వాములయ్యారు.ఆమె కంపెనీ లో చేరిన సంవత్సరానికి ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  మాత్రమే కాకుండా కంపెనీ సీఈవో బాధ్యతలు కూడా చేపట్టారు.

 విచిత్రమేమిటంటే ఆమెకు సాంకేతిక పై అస్సలు ఆసక్తి లేదు మొదటి నుంచి ఆమె ప్రయాణం వార్తా మాధ్యమం వైపు ఉండగా ఆ తర్వాత సాంకేతిక రంగం వైపు  మళ్ళింది.  తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చలని పని మీద పూర్తిగా దృష్టి పెట్టాలని అర్థం చేసుకుని సాంకేతిక కు మార్చుకున్నారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న ఈమెకు యోగ మీద ఆసక్తి ఎక్కువ. హెచ్ సి ఎల్ లో చేరడానికి ముందు రోష్ని శివ నాడార్ ఫౌండేషన్ లో  ట్రస్టీ గా సేవలు అందించారు. ఈ సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా శ్రీ శివ సుబ్రమణ్య నదర్ అనే కాలేజీ నీ చెన్నైలో నడుపుతోంది. 2018లో హ్యాబిటేట్స్ ట్రస్ట్ ను స్థాపించి భారతదేశానికి చెందిన ప్రాణులను సంరక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: