కాజల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తోంది. ఎప్పుడో ఆమెకు మ్యారేజ్ అయిపోయింది కదా.. ఇపుడా విషయం ఎందుకు అనే డౌట్ రావొచ్చు. అయితే అందులోనే విషయం ఉంది. ఎందుకంటే కాజల్ పెళ్లి సమయంలో ఓ పెద్ద చిత్రానికి సైన్ పెట్టింది. మ్యారేజ్ తర్వాత ఆమె తొలిసారిగా బాలీవుడ్ చిత్రం చేయబోతోంది. ఉమ అనే యువతి కారణగా.. పెళ్లి జరుగబోయే ఇంట్లో ఎలాంటి మార్పులు జరిగాయి అనే నేపథ్యంలో దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. కాజల్ ఉమ క్యారెక్టర్ లో కనిపించబోతుండటం విశేషం. కాజల్ క్యారెక్టర్ పేరు... సినిమా పేరు అయిపోయింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు తతగత సింఘా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాను మిరాజ్ గ్రూప్ బ్యానర్ పై అవికేష్ ఘోష్-మంతరాజ్ పాలివాల్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు సుజోయ్ క్రియేటర్ ప్రొడ్యూసర్ గా ఉండబోతున్నాడు. కాజల్ మరో ఇటీవలే ఓ రికార్డ్ కూడా క్రియేట్ చేసుకుంది. అదేంటంటే సినీ జీవితంలో 17సంవత్సరాలు పూర్తి చేసుకొని తిరుగులేని హీరోయిగా వెండితెరపై వెలుగొందుతోంది.
వినూత్నమైన కథలో నటించేందుకు తాను ఎదురు చూస్తున్నట్టు చెబుతోంది కాజల్. ఇలాంటి వైవిధ్యమైన పాత్రల్లో నటించం తనకెంతో సంతోషంగా ఉందంటోంది. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందా.. షూటింగ్ సెట్ కు వెళదామా అనే ఫీలింగ్ లో ఉన్నట్టు చెబుతోంది. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుండగా.. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ తో ఆచార్య, నాగార్జునతో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి