మన
సినిమా హీరో లు సినిమాల ను తెరకెక్కించడమే కాదు దీపం ఉన్నప్పు డే ఇల్లు చక్కదిద్దుకోవాల నీ ఇతర బిజినెస్ ల లో కూడా పెట్టుబడులు పెట్టి సినిమాల్లో వచ్చిన డబ్బు అక్కడ ఇన్వెస్ట్ చేసి దానిద్వారా రెట్టింపు డబ్బు సంపాదిస్తున్నారు. ఏదేమైనా ఇది స్వార్ధం అని చెప్పకుండా తెలివితో వారు వారి క్రేజ్ ను ఉపయోగించుకుంటున్నారని చెప్పవచ్చు. నిజానికి ఏ వ్యక్తి అయినా తనకున్న సామర్థ్యంతో డబ్బు సంపాదించాలని చూస్తాడు. అలానే హీరోలు కూడా తమ సామర్ధ్యం ఉపయోగించి సినిమాల్లో చేస్తూనే ఇతర బిజినెస్ లో డబ్బులు పెట్టి సంపాదిస్తున్నారు.

టాలీవుడ్ హీరోల ను ఎంతగానో కదిలించిన బిజినెస్
సినిమా థియేటర్ ల బిజినెస్.
సినిమా థియేటర్లు ఉంటే దానికి వచ్చే అడ్వాంటేజ్ లు చాలా ఉన్నాయి. తన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఎన్నిరోజులైనా
థియేటర్ లో నడిపించవచ్చు. హిట్ అయితే ఎక్కువ షో లు వేసుకొని మరీ ప్రేక్షకుల ను అలలరించవచ్చు. ఆ విధంగా మన
టాలీవుడ్ లో చాలా మంది హీరోలు సొంత థియేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

తొలుత మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ పేరుతో ఒక మల్టీప్లెక్స్
సినిమా థియేటర్ ను నిర్మించాడు. హైదరాబాదులోని గచ్చిబౌలి లో ఆయన అంగరంగ వైభవంగా భారీస్థాయిలో
సినిమా థియేటర్ ను నిర్మించి గొప్ప
సినిమా అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తున్నారు. మహేష్ స్ట్రాటజీని ఫాలో అవుతూ కుర్ర
హీరో విజయ్
దేవరకొండ కూడా ఏవిడి సినిమాస్ అనే పేరుతో
మహబూబ్ నగర్ లో మల్టీప్లెక్స్
సినిమా థియేటర్ ను నిర్మించాడు.
అల్లు అర్జున్ కూడా వీరిద్దరిని ఫాలో అవుతూ AAA
థియేటర్ ను నిర్మిస్తున్నాడు. మరి వీరిని ఫాలో అవుతూ ఇంకెంత మంది
టాలీవుడ్ హీరోలు థియేటర్ల బిజినెస్ కు దిగుతారో చూడాలి.