అంతకుముందు మోడల్ గా వెబ్ సీరీస్ యాక్ట్రెస్ గా ఏదో అలా చేసుకుంటూ వెళ్తున్న దివి వాధ్య ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే ఫేమస్ అయ్యింది. ఉన్నది కొద్దిరోజులే అయినా తన గ్లామర్ షోతో బిగ్ బాస్ కు కలరింగ్ తెచ్చింది. హౌజ్ లో ఉన్నన్నాళ్లు ఆమె కోసమే చూసే ఆడియెన్స్ ని ఏర్పరచుకుంది దివి. అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తన ఫాలోయింగ్ పెంచుకుంది. అప్పటిదాకా 20 వేలు మాత్రమే ఉన్నా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ 2, 3 లక్షలు దాటేసరికి అమ్మడికి బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.

ఈ క్రమంలో హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లని ఆకట్టుకుంది. ఇక లేటెస్ట్ గా ప్రైవేట్ సాంగ్స్ తో తన సత్తా చాటుతుంది దివి. ఆ మధ్య క్యాబ్ స్టోరీస్ అంటూ ఓ సాంగ్ చేసిన దివి కొత్తగా సిలక ముక్కు దానా సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమ్మడు చేసిన ఈ సాంగ్ సూపర్ అనిపించుకుంటుంది. ఫోక్ సాంగ్ టైప్ లో ఉన్నా పాటలో దివి అందాలు, డ్యాన్స్, స్టైల్ అన్ని ఆకట్టుకున్నాయి. హీరోయిన్ మెటీరియల్ అయిన ఈ అమ్మడు సరైన సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.

సిలక ముక్కు దానా సాంగ్ లో దివి అదరగొట్టింది. డ్యాన్స్ లో కూడా తన ప్రావీణ్యత చూపిస్తుంది అమ్మడు. మరి అమ్మడిలోని ఈ టాలెంట్ చూసైనా దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారేమో చూడాలి. దివి చేస్తున్న ఈ ప్రైవేట్ సాంగ్స్ కు స్పెషల్ క్రేజ్ వస్తుంది. సిలకా ముక్కు దాన సాంగ్ ను శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేయడం విశేషం. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దివి ఫ్యాన్స్ అంతా ఈ సాంగ్ తో పండుగ చేసుకుంటున్నారు. బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీని దివి బాగానే వాడుకుంటుందని చెప్పొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: