టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా 1980 మరియు 90 లో ఒక్కో
హీరో ఐదు నుంచి పది సినిమాల వరకు ఏడాదిలో విడుదల చేసే వారు. అప్పట్లో ఒక్కో
సినిమా రెండు మూడు నెలల్లోనే పూర్తి చేసేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్కొక్క సినిమాను సంవత్సరాలు సంవత్సరాలు తెరకెక్కిస్తున్నారు. అప్పుడు క్వాలిటీ కి ఇప్పుడు క్వాలిటీ కి అప్పుడు ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. కానీ సినిమాల చిత్రీకరణ మాత్రం తగ్గుతూ వచ్చాయి. రాజమౌళి శంకర్ వంటి దర్శకులు అద్భుతమైన సినిమాలను అయితే తీస్తున్నారు కానీ వారు ఆ సినిమాను తెరకెక్కించేందుకు రెండు నుంచి మూడు ఏళ్లు అంతకు మించి సమయం తీసుకుంటున్నారు.
ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి స్టార్స్ ఒకానొక సమయంలో ఏడాదికి ఐదు పది సినిమాలు కూడా విడుదల చేశారు.
చిరంజీవి బాలకృష్ణ జనరేషన్ హీరోలు కూడా పెద్ద మొత్తంలో సినిమాలు చేశారు. అప్పట్లో హీరోలు ఒకే రోజు మూడు షిఫ్ట్ లు పనిచేసేవారు. పొద్దున ఒక
సినిమా మధ్యాహ్నం ఒక
సినిమా రాత్రి ఒక
సినిమా షూటింగ్ లో పాల్గొన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఒక్క రోజులో ఒక
హీరో ఒక
సినిమా షూటింగ్ లో మాత్రమే పాల్గొంటాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆవిధంగా నటించే పరిస్థితి హీరోలు లేదు. షూటింగ్ లు చాలా నెమ్మదిగా సాగుతుంది. తద్వారా ఇతర సినిమాలకు కమిట్ అవ్వడం చాలా ఆలస్యం అవుతోంది.
ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక సినిమాలు ఎన్నో కూడా రెండు మూడు నెలల్లోనే పూర్తి అయ్యాయి. దీనిపై ఇటీవల ఒక ప్రముఖ
నిర్మాత వ్యాఖ్యలు చేశాడు.
ఎన్టీఆర్ కెరీర్ లో ఒక సూపర్ హిట్
సినిమా 30 రోజులు డేట్లు ఇచ్చాడు. అప్పట్లో ఆ
సినిమా భారీ బడ్జెట్ మూవీగా ఆయన చెప్పుకొచ్చాడు. ఆ
సినిమా నీ కూడా కొన్ని రోజుల్లోనే ముగించారు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అప్పటి హీరోలు ఎంత కష్టపడ్డా తక్కువ పారితోషికం వచ్చేది. అప్పట్లో కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటే అబ్బో అనేవారు. పారితోషికం విషయంలో గత 20 ఏళ్లుగా మాత్రమే కోట్లు ఇస్తున్నారు. పారితోషకం పెరిగిన తర్వాత హీరోలు సినిమాల సంఖ్య తగ్గించారు. తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే సమయంలో ఎక్కువ సినిమాలు చేసే వారు కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువ పారితోషకం వచ్చినా కూడా ఎక్కువ సినిమాలు చేయడం లేదు.