
ఇప్పటి దాకా కేవలం ఈ మూవీ తెలుగులోనే కాదు మన దేశంలోనే ఎక్కువ బాక్సాఫీస్ కలెక్షన్లు వసూళ్లు రాబట్టిన మూవీగా రికార్డులకు ఎక్కిందని చెప్పాలి. కాగా డిజిటల్ యుగంలో మన దేశంలోనే అత్యంత ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించిన మూవీగా బాహుబలి రెండు సినిమాలు రికార్డులకు ఎక్కాయని తెలుస్తోంది. కాగా మొత్తంగా మాములు మహా భారత కథను పోలినట్టు ఉన్న బాహుబలి సిరీస్ కాస్త ఇండియన్ సినిమాలో ఒక ఎపిక్‌గా చరిత్ర సృష్టించిందని చెప్పక తప్పదు.
ఇంతటి సంచలన మూవీ విడుదలై ఇప్పటికీ నేటికి 6 యేళ్లు పూర్తి చేసుకుంటోందని తెలపాలి. భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో రికార్డులు తిరగరాసింది బాహుబలి. హిందీలో ఖాన్స్ త్రయంతో పాటు హృతిక్, అక్షయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల కలెక్షన్లను కూడా వెనక్కి తన్ని ఏకంగా ఇండియన్ హిస్టరీలో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలబడింది ఈ మూవీ.
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి మూవీ ఏకంగా తొలి రోజే రూ. 100 కోట్ల షేర్ సాధించిన మూవీగా రికార్డులను తిరగరాసింది. ఇక అంతేకాదు ప్రభాస్, అనుష్కలతో కలిసిసత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్‌లు ఎంతో కీలకమైన పాత్రల్లో చేసి సినిమాను మరో స్థాయికి తీసుకెల్లారు. ఈ బాహుబలి సిరీస్‌తోనే హీరోగా ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా అమాంతం పెరిగి ఆయన నేషనల్ స్టార్ అయ్యారు.