సినిమా పరిశ్రమలో ఎప్పట్నుంచో ఒక హీరో హీరోయిన్ లు వరుసగా రెండు సినిమాలు చేస్తే వారికి ఎఫైర్లు అంటగడతారు. వారి ఇష్టాఇష్టాలు, కుటుంబ నేపథ్యం తో సంబంధం లేకుండా ఈ విధంగా వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని సహజీవనం చేస్తున్నారని పుకార్లు పుట్టించి వారి తీరని మనోవేదనకు కారణమవుతున్నారు. ఇలా పుకార్లు పుట్టించడం వల్ల ఎంతోమంది హీరో హీరోయిన్లు ఎంతో సఫర్ అయ్యారు.  ఒక జంట నటించిన సినిమా సక్సెస్ అయ్యిందంటే వారికి హిట్ పెయిర్ అని పేరు పెట్టి మరొక సినిమా చేస్తే మాత్రం వీరి కి ఎఫైర్ ఉందని విమర్శించడం ఏమాత్రం సరికాదు.

మంచి ప్రేక్షకులు హిట్ జంటను మళ్లీ మళ్లీ తెరమీద చూడాలనుకుంటారు. కానీ వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఎవరూ అనుకోరు. ఒకవేళ వారిద్దరి ఇష్టాలు కలిసి అభిప్రాయాలు కలిస్తే వారు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం అనేది వేరే విషయం. ఇది పక్కన పెడితే సురేష్ , నదియా జంటగా నటించిన ఒక తమిళ చిత్రం సక్సెస్ కావడంతో వరుసగా వారి కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అలా వాళ్ళిద్దరూ కలిసి ప్రతి సినిమాలో నటించడం తో వారి మధ్య సంబంధాన్ని సృష్టించి సురేష్ నదియా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. అందులో అప్పటి తమిళ పత్రికలు కూడా భాగమయ్యాయి.

ఈ విషయంపై ఒక సందర్భంలో సురేష్ మాట్లాడుతూ నిజానికి మేము ఎప్పుడూ ఆ సంగతి ఆలోచించలేదు.  అలాంటి ఉద్దేశం కూడా మాకు లేదు. కాకపోతే మేము మంచి స్నేహితులం. చాలా సన్నిహితంగా ఉంటాం అని వెల్లడించారు. ఆ తరువాత ఇలాంటి వదంతులు వస్తున్నాయి అనే సురేష్ ఒకే హీరోయిన్ తో వరసగా సినిమాలు చేయకుండా ఒక్కొక్క సినిమా కి ఒక్కో హీరోయిన్ తో మాత్రమే సినిమా చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం సురేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఉండగా, నదియా కూడా అత్తారింటికి దారేది సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి మంచి పాత్రలు చేసుకుంటూ పోతుంది. నదియా కాంబినేషన్ లో మళ్లీ నటించే అవకాశం వచ్చినా సురేష్ గతంలో చాలాసార్లు నో చెప్పారట. కొద్దికాలానికే నదియా శిరీష్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: