టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఇక ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ స్టార్ రేంజ్ లో వెళ్లిపోయాడు. ఇక మొదట్లో ఎన్నో సినిమాలలో నటించి అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు ప్రభాస్. అయితే అలాంటి సినిమాలలో ఒక సినిమా చక్రం. ఈ సినిమా ఎందుకు డిజాస్టర్ గా మిగిలింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభాస్ "ఈశ్వర్" సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా మాస్ హీరోగా బాగా పాపులర్ అయ్యాడు. ఇక ఆ తర్వాత రాఘవేంద్ర సినిమా తో ఫ్లాప్ ను చవిచూశాడు. ఇక వర్షం సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతోనే త్రిష కూడా మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
దాని తర్వాత చక్రం, అడవి రాముడు లాంటి సినిమాలు రాగా, ఈ సినిమాలో రెండు భారీ డిజాస్టర్ ను చవిచూశాయి. ఇక అడవిరాముడు సినిమా విషయానికి వస్తే ఎంతో బడ్జెట్ తో సినిమాను నిర్మించగా, టైటిల్ కి తగ్గట్టుగా సినిమా లేకపోవడంతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు నిరుత్సాహంతో వెనుదిరిగి పోయారు. ఇక చక్రం సినిమా విషయానికొస్తే..
ఈ సినిమాను కృష్ణవంశీ డైరెక్షన్ చేయగా, ఇందులో హీరోయిన్ గా ఛార్మి కూడా నటించింది. ఈ సినిమా కూడా జనాలను ఆకట్టుకోలేకపోయింది. వర్షం లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఈ సినిమాని విడుదల చేయడం వల్ల, వర్షం సినిమా ద్వారా సంపాదించిన ఫేమ్ కాస్త తగ్గి పోయిందని చెప్పవచ్చు. ఇందుకు గల మెయిన్ కారణం ఏమిటంటే.. ఈ కథతో అప్పట్లోనే చాలా సినిమాలు వచ్చాయి. అందుకే తనే ( ప్రభాస్ ) ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయి, మొదటి ఆట తోనే ఫ్లాప్ టాక్ చవిచూస్తుంది. ఇక ఈ సినిమా కథ మొత్తం ప్రభాస్ మీదే ఆధారపడి ఉన్నది. అంతేకాకుండా రొటీన్ స్టోరీ అవ్వడం వల్ల ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి