అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టింది. ఎప్పటికైనా ఈ ముద్దుగుమ్మకు దర్శకత్వం చేయాలని ఉందట. అందుకోసం ఇప్పటికే అవసరమైన కథను కూడా సిద్ధం చేసుకున్నట్లు ఈ అమ్మడు తనకు బాగా తెలిసిన వాళ్ల దగ్గర పేర్కొందట. తెలుగులోనే కాకుండా ఏ ఇండస్ర్టీలో అయినా హీరోయిన్లు దర్శకత్వం చేసిన వారి జాబితా చాలా చిన్నది. చాలా కొద్ది మంది హీరోయిన్లు మూవీ కెప్టెన్లుగా మారగా... వారిలో అతి కొద్ది మందికి మాత్రమే విజయం వరించి వారి జర్నీ సాఫీగా సాగిపోయింది. కానీ చాలా మంది విషయంలో మాత్రం నెగటివ్ గానే జరిగింది. ఇక ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడిప్పుడే ఆఫర్లు పెరుగుతున్నాయి. కానీ ఈ బ్యూటీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి నివేథా ఇలా చేసిందని చర్చించుకుంటున్నారు. కానీ చాలా మంది నివేథాకు చాలా ట్యాలెంట్ ఉందని .... కష్టపడితే ఈ రంగంలో విజయం సాదించడం పక్కా... అని విశ్లేషకులు, ఫిలిం నగర్ వర్గాల వారు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి