తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రేక్షకులలో ఆయనకు ఎంతో అభిమానం ఉంది. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడి పోయాడు నాజర్. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల అద్భుతమైన నటుడు. తెలుగులో మాత్రమే కాకుండా దాదాపు భారతదేశంలోని అన్ని భాషలలో అందరికీ సుపరిచితమైన నాజర్ అన్ని భాషలు నేర్చుకొని ఆ భాషకు తగ్గట్లుగా ప్రేక్షకులకు తగ్గట్లు నటించి వారి ఆదరాభిమానాలను పొందుతాడు.  ఏ భాష అయినా సరే తానే డబ్బింగ్ చెప్పుకొని అలరిస్తూ ఉంటారు.

తెలుగులో కూడా ఆయన ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. పని లో ఎంత కమిట్మెంట్ గా ఉంటారో బయట కూడా అంతే సిన్సియర్ గా ఉండడానికి ప్రయత్నిస్తారు. అయితే ఒకప్పుడు ఆయన పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఇండస్ట్రీలో దివాలా తీసి ఆస్తిని పూర్తిగా కోల్పోయారట. నటనను నమ్ముకొని ఉండడంతో ఆయన ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారట. ఆస్తి దివాలా తీసిన తర్వాత తిరిగి ఎలా సంపాదించుకున్నాడు అనే విషయాన్ని స్వయంగా ఆయన వెల్లడించారు.

నాజర్ తండ్రి ఓ స్టేజ్ ఆర్టిస్ట్. ఆయనకు నటన మీద మక్కువ ఎక్కువ. అందుకే నాజర్ ను నటుడిగా చూడాలనుకున్నారు. అలా తండ్రి కోరిక మేరకు సినిమాల్లోకి వచ్చాడు నాజర్. అయితే ఏ సినిమాలో ఛాన్స్ రాకపోవడంతో తాజ్ హోటల్ లో వెయిటర్ గా జాయిన్ అయ్యాడు. హోటల్ లో పనిచేసినన్ని రోజులు సినిమాల్లో నటించాలన్న విషయాన్ని మరిచి పోయారు నాజర్. హోటల్ లో తనకు 300 రూపాయల జీతం, తిప్ డబ్బులు కూడా వచ్చేవి. ఆ తర్వాత తండ్రి మళ్ళీ బలవంతం చేయడంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేరి నటనలో మెళుకువలు నేర్చుకొని సినిమాలో ఆర్టిస్ట్ గా కొనసాగారు. కమల్ హాసన్ నాయకుడు సినిమా ఆయన కెరీర్ ను చేంజ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: