తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దర్శకత్వంలో ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించారు. అయితే రాజమౌళి దర్శకుడిగా సక్సెస్ సాధించడానికి విజయేంద్ర ప్రసాద్ ఒక విధంగా కారణమనే సంగతి అందరికి తెలిసిందే. ఇక రాజమౌళి ప్రతి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించి జక్కన్న పనిని తేలిక చేస్తుంటాడు. కాగా.. విజయేంద్ర ప్రసాద్ కథలు రాజమౌళి సినిమాల రూపంలో తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశీ ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి.

ఇక దర్శకుడిగా విజయేంద్ర ప్రసాద్ సక్సెస్ సాధించకపోయినా రచయితగా మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే  విజయేంద్ర ప్రసాద్  చెప్పే స్టోరీ ఐడియాస్ లో కేవలం 10 శాతం మాత్రమే రాజమౌళికి నచ్చుతాయని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రాజమౌళిని ఇంప్రెస్ చేయడం తేలిక కాదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

అయితే విజయేంద్ర ప్రసాద్ కు ఏదైనా కథ బాగా నచ్చినా రాజమౌళికి నచ్చకపోతే ఆ కథ విషయంలో జక్కన్న తండ్రి మాట కూడా వినరని అర్ధం అవుతుంది. కాగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ కానున్న సంగతి అందరికి తెలిసిన విదితమే. ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచడంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో సందేహాలు తొలగిపోతున్నాయని అన్నారు.

అంతేకాదు.. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని అన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ రాజమౌళి కాంబో మూవీ పట్టాలెక్కనుండగా ఈ సినిమా జంగిల్ బేస్డ్ అడ్వెంచరస్ మూవీ కావడం గమనార్హం అనే చెప్పాలి. ఇక దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: