కర్లీ హెయిర్.. వంపు సొంపుల శరీరాకృతి.. కవ్వించే నవ్వు.. సహజ నటన.. ఇవన్నీ ఒక్కరిలోనే ఇమిడి ఉన్నాయి. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు సోనియా దీప్తి. హ్యాపీడేస్ చిత్రంతో తన సహజ నటనతో కుర్రకారును మెప్పించింది. ఒక ఆడిషన్ లో ఆమె నటనకు ఫిదా అయిపోయిన దర్శకుడు శేఖర్ కమ్ముల 2007లో తాను దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాలో అవకాశం ఇచ్చారు. అందులో శ్రావ్ అనే పాత్రకు న్యాయం చేసింది. అప్పటి నుంచి శ్రావ్ సోనియాగా పేరొందుతోంది ఈ బ్యూటీ. హ్యాపీడేస్ చిత్రం హిట్ కొట్టి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇంకేముందీ సోనియాకు 2008వ సంవత్సరంలో ఫిలిమ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. అంతేకాదు దక్షిణాది ఆరు పురస్కారాలు కైవసం చేసుకుంది. ఉత్తమ సహాయ నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సానియా నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులే పడ్డాయి.

ఎప్పుడైతే హ్యాపీడేస్ చిత్రం చేసిందో అప్పటి నుంచి  సోనియా  వెనక్కి తిరిగి చూసుకోలేదు. తొలిసారి హీరోయిన్ గా వినాయకుడు చిత్రంలో అవకాశం వచ్చింది. అందులోనూ నటించి.. ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంది. వినాయకుడు సినిమాలో స్రవంతి క్యారెక్టర్ కు న్యాయం చేసింది. తెలుగు హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమై.. అనేక తమిళ సినిమాల్లో తన నటనా ప్రతిభ కనుబరిచింది.    

సోనియా దీప్తి పుట్టింది పెరిగిందీ అంతా హైదరాబాద్ లోనే. 1984సంవత్సరం జులై 29వ తేదీన భాగ్యనగరంలో జన్మించింది.
చదువంతా హైదరాబాద్ లోనే పూర్తి చేసింది. కంప్యూటర్ అప్లికేషన్స్ లో గ్రాడ్యుయేషన్ చదివింది. తర్వాత ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసింది. ఒక ప్రచార కార్యక్రమంలో సోనియా దీప్తిని చూసిన శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ చిత్రంలో అవకాశం కల్పించారు. అలా ఆమె సినిమా ఇండస్ట్రీకి పరిచయమయింది. సోనియా దీప్తి భవిష్యత్తులో మంచి నటిగా ఎదగాలని ఆశిద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: