ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు అయితే బాగా చదువుకొని..  మంచి ఉద్యోగం సాధించాలి అని అందరు అనుకొనే వారు.. కానీ ఇప్పుడు మాత్రం కాస్త క్రియేటివ్ గా ఆలోచించి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు.  ఎందుకంటే ప్రస్తుతం యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదాయ వనరు గా మారిపోయింది. ఉద్యోగం వ్యాపారం చేస్తే వచ్చిన దాని కంటే యూట్యూబ్ ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్నారు నేటి రోజుల్లో చాలా మంది యువత. నేటి రోజుల్లో యూట్యూబ్ నే ఒక ఆదాయ ఆయుధంగా మార్చుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  యూట్యూబ్ లో సరికొత్త కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఒక విధంగా ఫేమస్ అవుతూనే మరొక విధంగా భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు.



 అయితే ఇటీవలి కాలంలో యూట్యూబ్ లో ఎక్కువగా యువత ఎంచుకుంటుంది ఫ్రాంక్ వీడియోలు. ఇలా ఫ్రాంక్ వీడియోల ద్వారా ప్రస్తుతం యూట్యూబ్ లో ఎంతోమందినీ అలరిస్తున్నారు. అయితే ఇలా ఎవరో తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి మాట్లాడటం లేదా బెదిరించడం.. లేదా గొడవలు పెట్టుకోవడం లాంటివి చేసి ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు చేయడం ద్వారా ఎంతోమంది నెటిజన్లను ఆకర్షించి భారీగా  ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా రోజురోజుకు యూట్యూబ్లో ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నవారి సంఖ్య పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే కొన్ని కొన్ని సార్లు ఫ్రాంక్ వీడియోలు చేసినప్పుడు చేదు అనుభవం ఎదురవుతుంది  ఇక్కడ ఓ యువకుడికి ఫ్రాంక్ వీడియో పిచ్చి ఏకంగా ఆ యువకుడికి దెబ్బలు తగిలేలా చేసింది. హైదరాబాద్ జగదీష్ మార్కెట్ లో ఇటీవలే ఓ యూట్యూబర్ ఫ్రాంక్ వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. ఇక ఈ వీడియో కోసం అక్కడ ఉన్న ఒక దుకాణాదారుడితో గొడవ పడ్డాడు  అయితే ఆ దుకాణదారుడు చాలా కోపిష్టి ఉన్నట్టున్నాడు. ఏకంగా కోపంతో ఊగిపోయి దారుణంగా ప్రాంక్ వీడియో చేస్తున్న యువకుడిని కొట్టాడు. అంకుల్ ఇది ప్రాంక్ అని చెప్పినప్పటికీ ఆ దుకాణదారుడు మాత్రం అస్సలు వినిపించుకోలేదు. దీంతో వీడియో కోసం చివరికి ఆ యువకుడు దెబ్బలు తినాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: