శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మహా సముద్రం. ఈ సినిమాను ఆరెక్స్ 100 ఫేం అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర, అనీల్ సుంకరమూవీ నిర్మిస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ గా ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమా నుండి లేటెస్ట్ గా వచ్చిన మోషన్ పోస్టర్ లో సిద్ధార్థ్ లుక్ రివీల్ చేశారు. ఈ పోస్టర్ లో సిద్ధార్థ్ డ్యాషింగ్ లుక్ తో అదరగొట్టాడు.

తెలుగులో ఒకప్పుడు లవర్ బోయ్ ఇమేజ్ తో సత్తా చాటిన సిద్ధార్థ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్లీ మహా సముద్రం సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని అంటున్నారు. అంతేకాదు ఫస్ట్ టైం సిద్ధార్థ్ నెగటివ్ టచ్ లో ఉన్న పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. మోషన్ పోస్టర్ లో సిద్ధార్థ్ లుక్ చూసి సిద్ధు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కచ్చితంగా తెలుగులో సిద్ధార్థ్ కి ఇది మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని అంటున్నారు.

కోలీవుడ్ లో వరుస ప్రయోగాలు చేస్తూ కెరియర్ వెళ్లదీస్తున్న సిద్ధార్థ్ తెలుగులో మాత్రం తనకు ఉన్న హీరో ఇమేజ్ ను మరోసారి కాపడుకునే ప్రయ్త్నం చేస్తున్నాడు. మహా సముద్రంతో సిద్ధార్థ్ మళ్లీ ఫాం లోకి రావడం పక్కా అని చెబుతున్నారు. శర్వానంద్ కు ఏమాత్రం తగ్గని విధంగా సిద్ధార్థ్ తన నటనతో మెప్పించాడని చిత్రయూనిట్ చెబుతుంది. మహా సముద్రం మూవీలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక మీదట సిద్ధార్థ్ కూడా మహా సముద్రం తర్వాత తెలుగులో కూడా వరుస సినిమాలు చేయాలని చూస్తున్నాడు. తెలుగులో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను కాపాడుకునే ప్రయత్నంలో మళ్లీ ఇక్కడ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు సిద్ధార్థ్.


మరింత సమాచారం తెలుసుకోండి: