బాలీవుడ్ నటుడు సోనూసూద్ కాస్తా ఇప్పుడు భారతీయ నటుడు సోనూ సూద్ గా మారిపోయాడు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవ ఎంత మార్పు తెచ్చిందంటే కరోనాకు ముందు సోను లైఫ్, తరువాత లైఫ్ అనేలా. కరోనా కష్ట సమయంలో ఆదుకునే నాథుడు లేక, ఆకస్మిక లాక్ డౌన్ కారణంగా, తినడానికి, ఇంటికి వెళ్ళడానికి అవస్థలు పడుతూ, సొంత గూటికి చేరుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న వలస కూలీలకు తన డబ్బులతో ప్రయాణ సౌకర్యం కల్పించాడు. అప్పటి నుంచి అందరి కన్నూ సోనూపై పడింది. ప్రభుత్వం కూడా వారి విషయంలో చోద్యం చూస్తున్నప్పుడు సినిమాల్లో సహాయక పాత్రలు పోషించే సోనూసూద్ మహమ్మారికి వెరవకుండా బయటకు సహాయం చేశాడు. కొంతమంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికే ఈ కథలంతా అని విమర్శించినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు సరికదా అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కష్టం అనే మాట విన్పించినా చాలు వచ్చి సూపర్ మ్యాన్ లా వచ్చి వాలిపోతుంటారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఆయన చేసిన సేవకు దేశం మొత్తం రుణపడి ఉంది.

సోను వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... ఈ రియల్ హీరో జూలై 30న తన పుట్టినరోజును జరుపుకున్నాడు. అతను అంకితభావంతో ఉన్న భర్త, చురుకైన తండ్రి. ఆయన జీవితంలో ఓ ప్రేమ కథ ఉంది. ఆ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా కథ కంటే ఏమాత్రం తక్కువ కాదు. సోను సూద్ తన భార్య సోనాలిని నాగపూర్‌లోని 'యశ్వంతరావు చవాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌'లో చదువుతున్నప్పుడు కలిశాడు. అతను ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్నప్పుడు, ఆమె ఎంబీఏ చదువుతోంది. కలిసి చదువుతున్నప్పుడు వారు ముందుగా మంచి స్నేహితులు అయ్యారు. తరువాత వారికి తెలియకుండానే లోతుగా ప్రేమలో పడ్డారు. ఈ జంట వివాహం చేసుకున్న తర్వాత కూడా ఒకే రూమ్ లో ముగ్గురు కష్టపడుతున్న బ్యాచిలర్ అబ్బాయిలతో కలిసి నివసించేవారు. మొదట్లో సోనాలికి సోను నటుడిగా మారడం ఇష్టం లేదట. కానీ చివరికి అతని నిర్ణయానికి తన సపోర్ట్ ఇచ్చిందట. సోనూ సూద్ పంజాబీ కుటుంబానికి చెందినవాడు, అతని భార్య సోనాలి ఒక సాధారణ తెలుగు కుటుంబానికి చెందినది. 1999లో "కాళ్లజగ" సినిమాతో సోనూ వెండితెర ప్రయాణం ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: