ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న సినిమా ప్రాజెక్ట్ -కె. ఈ మూవీ పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు 500కోట్ల మేర బడ్జెట్ ను వైజయంతి మూవీస్ కేటాయించనుందని ప్రచారం సాగుతోంది. అలాగే హాలీవుడ్ నుంచి అవతార్ సహా ఎన్నో గొప్ప చిత్రాలకు పని చేసిన టెక్నీషియన్లను ఈ సినిమా కోసం బరిలో దించే ఆలోచనలో మూవీ మేక‌ర్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో న‌టిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ఏర్పాటు చేసిన సెట్లో ఆయన చిత్రీకరణలో పాల్గొన్నారు. ప్రస్తుతం అమితాబ్ పై సన్నివేశాలను మొద‌ల‌య్యాయి. సినిమా నిర్మాణం కోసం భారీగా ఆర్ ఎఫ్ సీ సెట్ల‌ను నిర్మిస్తున్నారు. 90 శాతం షూటింగ్ ఈ సెట్లలోనే పూర్తి చేసి భారీగా విజువల్ గ్రాఫిక్స్ ని జోడించాల్సి ఉంటుందని నాగ్ అశ్విన్ టీం చెబుతోంది. మూవీలో కేవలం గ్రాఫిక్స్ వీఎఫ్ ఎక్స్ కోసమే 200కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చిస్తారన్న ప్ర‌చారం సాగుతోంది.


మూవీలో దీపిక పదుకొనే పాత్రపై ఆసక్తికర చర్చ న‌డుస్తోంది.  ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపిక ఎలాంటి పాత్రలో నటించనుంది?  ప్రభాస్ కి ధీటుగా ఈ పొడుగుకాళ్ల సుందరి యాక్షన్ క్వీన్ గా నటించ‌నుందా? అంటూ ఆసక్తికర టాక్  న‌డుస్తోంది. అయితే దీపిక పదుకొనే ఇప్పటికే తన పనిని మొద‌లు పెట్టారు. ప్రాజెక్ట్ -కె  లె దీపికా ట్రిమ్ గా స్లిమ్ గా కనిపించ‌నుంది. పైగా యాక్షన్ ఎపిసోడ్స్ కి తగ్గట్టు దిపికా బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవాల్సి ఉంటుందట. టాలీవుడ్ లో  ఆరంగేట్రం చేస్తూనే దీపిక అదరగొట్టబోతోంది. ఆమె పాత్ర ఏమిటన్నది ఇప్పటికీ రహస్యంగా ఉంచినా అభిమానులు మాత్రం రకరకాలుగా ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.


 
    ఇక గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ వర్చువల్ టెక్నాలజీలతో భారీ బ‌డ్జెట్ తో తెరకెక్కనుండగా ప్రభాస్, దీపిక  ప్రాజెక్ట్ కె టీమ్ కి ట్రైనింగ్ కూడా ఉంటుందని సిని వ‌ర్గాలు భావిస్తున్నాయి. దీపిక ప్ర‌స్తుతం ఈ మూవీతో పాటు ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. దీంతో ఆమె అటు ముంబై ఇటు హైద‌రాబాద్ కు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ప్ర‌భాస్‌తో రొమాన్స్ చేయ‌నున్న దీపిక సినిమాకు త‌గ్గ‌ట్టుగా బాడీ లాంగ్వేజ్‌ను చేంజ్ చేసుకోనుంది. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతున్న ప్రాజెక్ట్ కె విజువ‌ల్ వండ‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: