టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తాడు అల్లరి నరేష్. అయన హీరోగా అల్లరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకుని వరస కామెడీ చిత్రాలు చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన అల్లరి నరేష్ మొదట్లో కామెడీ చిత్రాలు మాత్రమే చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పర్చుకున్నాడు. తర్వాత తర్వాత విభిన్నమైన చిత్రాలు కొన్ని చేస్తూ అల్లరి నరేష్ తన లో అన్ని రకాల నటుడు దాగి ఉన్నాడని చెప్పాడు.

ఇక హీరోగా గత కొన్ని రోజులుగా ఆయనకు చేదు ఫలితాలు ఎదురవుతుండడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించడం మొదలు పెట్టాడు. మహేష్ బాబు పూజా హెగ్డే జంటగా నటించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి అనే సినిమాలో అల్లరి నరేష్ నటించగా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త  పాత్రలో కనిపించాడు. దీంతో ఒక్కసారిగా తన కెరియర్ మొత్తం మారిపోయింది. అంతేకాదు ఆయన హీరోగా నటించిన నాంది సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో అల్లరి నరేష్ మునుపటి వైభవం అందుకున్నాడు. నిజం చెప్పాలంటే  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాతే అల్లరి నరేష్ ఇప్పుడు ఈ వరుస విజయాలు దక్కుతున్నాయి. 

అల్లరి నరేష్ కెరీర్ లో మచ్చు తునకలు గా మిగిలిపోతాయి ప్రాణం, నేను, కితకితలు, సీమశాస్త్రి, గమ్యం, బ్లేడ్ బాబ్జి, బెండు అప్పారావు, బెట్టింగ్ బంగార్రాజు, అహ నా పెళ్ళంట, సీమటపాకాయ్, సుడిగాడు, యముడికి మొగుడు, బ్రదర్ అఫ్ బొమ్మాలి వంటి సినిమాలు. ఇప్పటివరకు హీరోగా నటించిన అల్లరి నరేష్ ఇకపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు అలరిస్తాడట. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రస్తుతం ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమా ఆఫర్వాస్టి వస్లోతున్నాయట.ఇకపోతే అయన నుంచి సభకు నమస్కారం సినిమా ఒకటి క్రేజీ ఫిలిం గా వస్తుండగా ఇంకొకటి సింగినాదం జీలకర్ర అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలు ఆయనకు ఏ రేంజ్ విజయాన్ని అందిస్తాయో చూడాలి. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా అల్లరి నరేష్ వాటిని పట్టించుకోకుండా కష్టాన్ని నమ్ముకుని ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: