కరోనా సెకండ్ వేవ్ తర్వాత గత శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా హాళ్లు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.100 ఆక్యుపెన్సీ తో థియేటర్లు తెరచుకోవచ్చని తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చేసింది.అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నైట్ కర్ఫ్యూను కొనసాగిస్తూ 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లకు అనుమతులు ఇచ్చారు.ఇక తాజాగాకరోనా కేసులు పెరుగుతుండడంతో థర్డ్ వేవ్ కూడా రాబోతోందంటూ హెచ్చరికలు వస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో మన టాలీవుడ్ లో పెద్ద సినిమా రిలీజ్ లు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు లేకపోదలదని అంటున్నారు సినీ జనాలు.ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలు..

 టక్ జగదీష్, లవ్ స్టోరీ, విరాట పర్వం వంటి సినిమాలు జూలై చివరి వారంలో విడుదల చేయాలని మేకర్స్ అంతా ప్లాన్ చేశారు.కానీ సినిమా థియేటర్లు రీ ఓపెన్ అయిన తర్వాత కూడా వారి ప్లాన్స్ కి బ్రేకులు పడ్డాయి.ఇక కాస్త సమయం తీసుకొని ఆగస్టు నెల ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారట దర్శకనిర్మాతలు. కానీ ఆంద్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అక్కడ కొన్ని ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద సినిమాల విడుదల విషయంలో కొంత ఆలస్యంఅయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఇక ఏపీలో కోవిడ్ కేసుల పర్యవేక్షణ అనంతరం పరిస్థితులు అనుకూలించిన తర్వాతే..

 పెద్ద సినిమాల విడుదల విషయమై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని లేటెస్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక పరిస్థితులు అంతా అనుకూలిస్తే ఆగస్టు చివరి కల్లా పెద్ద చిత్రాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇక ప్రస్తుతం థియేటర్లలో కొన్ని చిన్న సినిమాలు ప్రదర్శింపబడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సత్యదేవ్ నటించిన తిమ్మరుసు సినిమాకి మంచి ప్రేక్షకాదరణ దక్కుతుంది.ఇక తేజ సజ్జా నటించిన ఇష్క్ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.ఇక ఆగస్టు 6 న కూడా మరి కొన్ని చిన్న సినిమాలు విడుదలవుతుండగా వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: