కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు పిమ్మటె వెంకీ అట్లూరి తో కూడా ఒక సినిమాను చేయబోతున్నారనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి రెమ్యునరేషన్ కి దాదాపు 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.
ఇక ఈ సినిమా పూర్తి అయ్యే సరికి.. ఇంకా ఎంత బడ్జెట్ పెరుగుతుందో అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. ఇక ఇందులో ధనుష్ ఒక వ్యవస్థను సక్రమమైన రీతిలో కి తీసుకు వచ్చేటువంటి ఒక యువకుడు కథతో ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో మరి కొన్ని ఎమోషన్ సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతానికి ధనుష్ మూడు సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు పూర్తి అయిన వెంటనే ఈ సినిమాను పట్టాలపైకి ఎక్కించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సినిమా కూడా మూడు భాషలలో నిర్మించబోతున్నారట. అయితే ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికార ప్రకటన రానుందని వినిపిస్తోంది. ఏదిఏమైనా ఈ సినిమాతో కూడా హిట్ కొడితే ఈయన రేంజ్ మరింత పెరిగిపోతుందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి