సాధారణంగా మెగా హీరోలకు అభిమానుల తాకిడి ఎక్కువే. మాస్ ఫాలోయింగ్ అయితే మరీ ఎక్కువ. అందుకే మెగా హీరోలు ఏ సినిమా చేసినా ఆ మూవీలకు బాగానే ఆదరణ దక్కుతుంది. కలెక్షన్లతో బాక్సాఫీస్ బద్దలవుతాయి. వారి విజయం వెనుక ఉన్న సీక్రెట్ మంత్రం ఒక్కటే.. అదే మమ.. మాస్. చిరంజీవి మాస్‌ మూవీస్‌తోనే మెగాస్టార్ అయ్యాడు. టాలీవుడ్ టాప్ చైర్‌ని దక్కించుకున్నాడు. అంతేకాదు ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో సూపర్ డూపర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు.      

చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు. ఎక్కువగా మాస్‌ మూవీస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నాడు. 'మగధీర, ట్రిపుల్ ఆర్' అని పీరియాడికల్ డ్రామాస్‌లోకి వెళ్లినా మాస్‌ అప్పీల్‌తోనే ఆడియన్స్‌ని మెప్పిస్తున్నాడు. అయితే చరణ్ మిగతా జానర్స్ జోలికి పోవడం లేదన్ టాక్ వినిపిస్తోంది.

రామ్ చరణ్‌ కెరీర్‌ బిగినింగ్‌లో సినిమా సినిమాకి డిఫరెన్స్ ఉండేలా చూసుకున్నాడు. మాస్‌ మూవీ 'చిరుత' తర్వాత ఫాంటసీ యాక్షన్‌ జానర్‌లో 'మగధీర' చేశాడు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఆ తర్వాత ప్యూర్ లవ్‌స్టోరి 'ఆరెంజ్'లో నటించాడు. అయితే ఈ మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో కంప్లీట్‌గా మాస్‌ మూవీస్‌లోకే వెళ్లిపోయాడు చరణ్.

'ఆరెంజ్' సినిమా నిర్మాత నాగబాబుకి కూడా నష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో చరణ్‌ మళ్లీ ప్యూర్ లవ్‌స్టోరీస్‌ని టచ్ చెయ్యలేదు. వరుసగా మాస్‌ మూవీసే చేశాడు. మెగాఫ్యామిలీకి స్ట్రాంగ్ మార్కెట్ ఉన్న బి,సి సెంటర్స్‌ని టార్గెట్ చేస్తూ మాస్, యాక్షన్‌ సినిమాలే చేస్తున్నాడు. శంకర్ డైరెక్షన్‌లో చేస్తోన్న సినిమా కూడా మాస్ యాంగిల్‌లోనే ఉంటుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.  


ఎప్పుడూ ఒకే ఫార్మాట్‌లో సినిమాలు చేస్తే ప్రేక్షకులు బోర్గా ఫీలవుతారు. అందుకే చాలామంది హీరోలు సినిమా, సినిమాకి ట్రాక్‌ మార్చుతుంటారు. అయితే రామ్ చరణ్‌ మాత్రం మాస్‌ మూవీస్‌నే నమ్ముకున్నాడు. బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.





మరింత సమాచారం తెలుసుకోండి: